భారతీయ సాంప్రదాయం ప్రకారం వైవాహిక జీవితం ఎంతో ముఖ్యంగా భావిస్తారు. యుక్త వయస్సు వచ్చిన యువతీ యువకులకు పెద్దలు సాంప్రదాయబద్దంగా అందరి సమక్షంలో ఎవరి స్థోమతను బట్టి వారు వైభవంగా వివాహం జరిపిస్తారు. అయితే వివాహం అనేది ఇద్దరు మనుషులు సుఖ సంతోషాల కోసమే కాదు సమాజాభివృద్ది కూడా ఇందులో దాగి ఉంటుంది. ప్రపంచంలో ఇది తర తరాలుగా వస్తున్న సాంప్రదాయమే..అయితే పూర్వ కాలంలో వివాహం జరిగిన పిదప సంతానం భాగ్యం వెంటనే కలిగేది. అప్పట్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అనేవి అరుదు..ఎక్కువ సంతానంతో కుటుంబాలు కొనసాగుతూ ఉండేవి..రాను రానూ కాలం మారింది..ప్రపంచ జనాభా విస్తృతంగా పెరిగిపోవడంతో స్త్రీ,పురుషులకు ఆపరేషన్లు చేయడం మొదలు పెట్టారు.

భారతీయ వివాహ సాంప్రదాయం


దీంతో చాలా వరకు జనాభా తగ్గుతూ వచ్చింది. అయితే వివాహం జరిగిన ఒకటీ రెండు సంవత్సరాల్లో దంపతులకు పిల్లలు కలగకుండా చాలా అపచారంగా భావించేవారు..సంతానం లేని వారిని చిన్నచూపు చూసేవారు. అయితే దీనికి కారణం పురుషులు కావచ్చే స్త్రీలు కావచ్చు. దీనికి గల కారణం పురుషుల్లో వీర్యకణాలలో నాణ్యత, కణాల సంఖ్యలో తగ్గుదల అనే సమస్యలు ఎక్కువగా ఈమధ్యకాలంలో వింటున్నాం. 30 సంవత్సరాల క్రితం పురుషులలో సాధారణంగా 1 మి.లీ. వీర్యంలో 6 కోట్ల వీర్యకణాలు ఉండేవి. ఇప్పుడు గణనీయంగా 2 కోట్లకు పడిపోయింది. దీనికి ముఖ్య కారణం ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులు, ఆహారం, మద్యం, దూమపాణం లాంటివి తీసుకోవడం అయితే కొంత మందికి వంశపార్యంపర సమస్యలు, మధుమేహం కూడా ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.

టమాటా, పుచ్చకాయ


అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ పురుషులకు ఓ శుభవార్త తీసుకు వచ్చారు వైద్య  పరిశోధకులు. పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని టమాట పిల్‌లతో 70 శాతం వృద్ధి చేయవచ్చని శిఫిల్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. మనం సాధారణంగా తీసుకునే పుచ్చకా, టమామాల్లో అద్భుతమైన శక్తి దాగి ఉందని వారు అంటున్నారు.  లైకోపెన్‌తో మరిన్ని సప్లిమెంట్‌లను కలిపి ఈ టమాట పిల్ తయారు చేస్తారు.అంతే కాదు  18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 60 మంది ఆరోగ్యవంతులైన పురుషులపై మూడు నెలలపాటూ పరిశోధనలు జరిపారు. ఈ విధానం ద్వారా వీర్యకణాల్లో నాణ్యతతో పాటూ, వీర్యకణాల సంఖ్య కూడా ఘననీయంగా పెరిగినట్టు గుర్తించారు. అయితే ఈ టమాటాపిల్ వాడటం వల్ల పురుషులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లాంటివి కలగవని వారు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: