నేటి బిజీ లైఫ్ లో ఎప్పుడు ఏ సమయానికి ఏది తింటున్నామో మనకే క్లారిటీ ఉంటాలేదు. ఏదో బతకడానికి తింటున్నాము తప్పితే, తిన్నది ఒంట పడుతుందా అంటే అదీ లేదు. నేటి టెక్నాలజీ రోజుల్లో మనుషులు ఎవరికి తోచిన సమయంలో వారు ఆహారాన్ని తీసుకుంటున్నారు. సమయానికి భోం చెయ్యడమనేది చాలా అరుదనే చెప్పవచ్చు. అదీ మళ్లీ కుటుంబ సభ్యులతో కలిసి భోం చెయ్యడమనేది ఎప్పుడో పండుగ సమయంలో తప్పితే రోజూ కుదరని పరిస్థితి.

 

అయితే మనిషి ప్రతిరోజు కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి సమయం దొరకడమే కష్టం అయిపోతుందనేధి మనందరికీ తెలిసిందే. అయితే కుటుంబ సభ్యులతో కలిసి భోం చెయ్యడం వల్ల చిరకాలం ఆరోగ్యంతో వర్ధిల్లుతామని చెబుతున్నారు పరిశోధకులు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తాజా అధ్యయనంలో తేలింది. తినే రుగ్మత(అతిగా తినడం.. లేదంటే అసలు తినకపోవడం) బారిన పడకుండా ఉండడానికి, భవిష్యత్తులో స్థూలకాయులుగా మారే ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఈ పద్ధతే ఉత్తమమైనదని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు.

దాదాపు 200 కుటుంబాలపై అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, అక్క, చెల్లి, తమ్ముడు, బంధువులు.. ఇలా అందరితో కలిసి కూర్చుండి తినడమే మేలంటున్నారు. ఇలా తినేటప్పుడు పిల్లల ఆహార అలవాట్లను తల్లిదండ్రులు దగ్గరగా పరిశీలిస్తారని, ఒకరు కాకపోయినా మరొకరు వారి తీరును పరిశీలించి సరిదిద్దడమే ఇందుకు కారణమని ఇల్లినాయిస్ యూనివర్సిటీకి చెందిన బార్బారా  తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: