మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారంతో పాటు తగినంత వ్యాయామం కూడా శరీరానికి అవసరమే. అయితే అది పరిమితికి మించి ఉండరాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్శిటీ పరిశోధకులు రోజూ వ్యాయామం చేసే వారిపై పరిశోధనలు చేసింది. సుదీర్ఘ వ్యాయామాలు సాగించే వారి రక్త నమూనాలను వ్యాయామానికి ముందు, వ్యాయామానికి తర్వాత సేకరించి, పరీక్షలు జరిపింది. ఆ వివరాలను తాజాగా వెల్లడించింది.

ప్రతి రోజూ చేసే వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలని తెలిపారు. మితిమీరిన వ్యాయామం వల్ల ఆరోగ్యం మెరుగుపడటానికి బదులు అనర్థాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి రోజు వ్యాయామం చేసేవారు గంట, రెండు గంటలకు మించి చేయకూడదని అంటున్నారు. నాలుగు, ఐదు గంటల పాటు వ్యాయం చేయడం వలన పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా రక్తంలో చేరుతుందని, తద్వారా రక్తం విషపూరితంగా మారి ప్రాణానికి ప్రమాదం తెచ్చిపెడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

 

పైగా తగిన ఆహారం తీసుకోకుండా వ్యాయామం చేస్తే, కేలోరీలు పూర్తిగా ఖర్చైపోయి మనిషి శారీరకంగా కుంగిపోయే ప్రమాదము లేకపోలేదు. పైగా వ్యాయామం చేసేటప్పుడు రోజు తగిన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తే చక్కటి శరీరపు షౌష్టవాన్ని సొంతం చేసుకోవచ్చు. పైగా మితాదును మించి వ్యాయామం చేయడం వల్లా శరీరం అలిసిపోయి ఉన్న సామర్థ్యాన్ని కూడా కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. దీనితి పాటు మోతాదు మించి వ్యాయామం వల్ల శరీరంలోని యములకు రాపిడి ఎక్కువై కరిగిపోయే ప్రమాదమూ నెలకొనే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: