రుతువులు మారే కాలంలో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయి. అటువంటి రోజుల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అందుకే కాలాలు మారే రోజుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గకుండా జాగ్రపడాలి. అందుకు తగిన ఆహారాన్ని తీసుకుకోవాలి.ప్రతి రోజు తీసుకునే టీకి బదులు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. అవి గుండెకి మేలు చేస్తాయి. శరీరంలో చెడు కొవ్వును దూరం  చేస్తాయి. దీనిలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

 

రకరకాల బ్యాక్టీరియాలనూ, ఇన్ ఫెక్షన్లనూ దూరంగా ఉంచే పోషకాలు కాలీ ఫ్లవర్‌లో అధికం. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్యాలను దూరం చేయడానికి ఉపయోగపడతాయి. అందుకే ఈ కాలంలో చిన్నారులకు కాలీఫ్లవర్‌తో కూరలే కాదు. రక రకాల వంటకాలూ చేసి తినిపిస్తే మంచిది. అదే విధంగా వెల్లుల్లిలో కూడా రోగ నిరోదక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో సల్ఫర్ పోషకాలెక్కువ.

 

అంతేకాదు శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా వర్షా కాలం వస్తున్నప్పుడు వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది. రకరకాల ఇన్‌ఫెక్షన్లని దూరం చేస్తుంది. అన్ని వయసుల వారూ వెల్లుల్లిని తీసుకోవచ్చు. అంతేకాక, వెల్లుల్లికి నొప్పులను మాయం చేసే శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఈ వెల్లుల్లిని రోజూ ఆహారంలో తీసుకోవడం ద్వారా రోగనిరోధకశక్తిని సైతం పెంపొందించుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: