ఆరోగ్య నియమాలు మనం చెప్పినంత ఈజీ ఆచరణలో చాలా కష్టం. కాని గుండెకు సంబంధించినంత వరకు కొన్ని జాగ్రత్తలను కాస్త తేలిగ్గానే ఆచరించవచ్చు. ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లైతే గుండెను జాగ్రత్తగా కాపాడుకోడానికి ఉపయోగపడుతుంది.

 1. రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకున్నట్లైతే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

2. హడావుడిగా తినకుండా నిదానంగా తినేది అలవాటు చేసుకోండి.

3. వారంలో ఒక్కసారైనా చేపలు తినండి. చేపల్లో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి.

4. పొగతాగడం పూర్తిగా మానేయాలి. పొగాకు ఏ విధంగా వాడినా అది గుండెకు చేటని గుర్తుపెట్టుకోండి.

5 ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. దాని వల్ల గుండెజబ్బులు తగ్గుతాయి.

6.వీలుంటే మధ్యాహ్నం పూట నిద్రపోవడం మంచిది.

7. రాత్రి భోజనం మితంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.  

8. డైటింగ్ చేయకుండా, అందుకు బదులుగా ఎక్కువసార్లు తక్కువ మోతాదుల్లో తినండి.

9. మానసిక ఒత్తిడి తగ్గేందుకు జంతువులను పెంచుకోండి. వాటితో కాలం గడుపునప్పుడు మానసిక ఒత్తిడి తగ్గి గుండెపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.

10. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచే ఆకుకూరలు, కూరగాయల వాడకూడదు. ఫ్రిజ్‌లో పెట్టిన వాటిల్లో 50 నుంచి 60 శాతం పోషకాలు నశించిపోతాయి.

11. మీరు ఇష్టపడే ఆహారపదార్థాలను దేనినైనా పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కొంత సమయం తీసుకుంటూ అదేపనిగా తినకుండా అప్పుడప్పుడూ తినడం చాలామంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: