1. బొప్పాయి పువ్వుని నలిపి పేనుకొరుకుడు (తాత్కాలికంగా తలమీద వచ్చే బట్టతల మచ్చ) వచ్చినచోట రుద్దితే వెంట్రుకలు పెరుగుతాయి. ఈ చర్మవ్యాధికి ఎలర్జీ ముఖ్యకారణం. ఈ వ్యాధిలో స్థిరాయిడ్స్ కు సంబంధించిన చుక్కల మందుతో రుద్దితే వెంట్రకలు వస్తాయి. కానీ, కొందరికి రాకపోవచ్చు, కొందరిలో వెంట్రకకలు కుప్పలు కుప్పలుగా రాలిపోయి పెద్దపెద్ద బట్టతల మచ్చలు ఏర్పడుతూ వుంటాయి. అలాంటప్పుడు బొప్పాయి పూలను వాడితే ఫలితం కన్పించవచ్చు.. ప్రయత్నించిచూడండి. రోజూ రెండు మూడు సార్లు కొన్నాళ్ళపాటు వాడితే మంచిది.


2. బొప్పాయి చెట్టుకి గీత పెట్టి పాలను సెకరించి దానికి సమానంగా నీరు కలిపి పలచగా గజ్జి, తామర మచ్చల పైన రాస్తే చర్మవ్యాధి కారకాలైన సూక్ష్మజీవులను నశిస్తాయి.

3. బొప్పాయి పాలని చిన్న అగ్గిపుల్లతో పురిపిడికాయపైన ఆరగా పెడితే పురిపిడి కాయలు రాలిపోతాయి.

4. బొప్పాయికాయనుగానీ, ఆకునుగానీ, ఆకునుగానీ దంచి, మెత్తగా పేస్ట్ లా చేసి ఆరికాళ్ళ ఆనే మీద కడితే ఆనెలు మెత్తపడతాయి.

5. బొప్పాయి కాయని దంచి రసం తీసి ఆ రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటమల తీవ్రత తగ్గుతుంది.

6. ముఖంమీద నల్లచుక్కలు కూడా ఈ ప్రయోగంతో తగ్గుతాయి. 7. శోభి మచ్చలమీద కూడా బొప్పాయికాయ రసం బాగా పనిచేస్తుంది. 8. బొప్పాయి గింజల్ని`కూడ పేస్టులా చేసి పైన చెప్పిన వ్యాధులన్నింటిలోనూ వాడవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: