పురాణ కాలం నుంచి మన పెద్దలు ఉదయం నిద్ర లేవగానే పళ్లు తోముకోకుండా, ఆ పాచినోటితోనే ఓ లీటరు నీళ్లు తాగితే  ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అంటారు. అయితే దీనిపై ఎంతో మంది పరిశోధనలు చేసి తేల్చిన విషయం ఏంటంటే ఉదయం పాచి నోటితో దాదాపు ఒక లీటరు నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.  అయితే ఈ విషయాన్ని నేటి శాస్త్రవేత్తలు ఏదో కనిపెట్టి చేప్పారనుకుంటే తప్పులో కాలు వేసినట్లే..ఈ విషయాన్ని వందల ఏళ్ల క్రితం వాగ్భటుడనే భారతీయ ఆయుర్వేద శాస్త్రవేత్త చెప్పారు.  రూపాయి ఖర్చు కూడా లేకుండానే అవన్నీ భారతీయ సమాజానికి అందించాడు.. ఈ ప్రక్రియను ఉష:పానం అంటారు. 


మనం సాధారణంగా భోజనం చేస్తున్నప్పుడు, లేదా భోజనం అయ్యాక నీరు తాగుతుంటాం కదా… భోజనానికి గంట ముందు గానీ, భోజనం తరువాత గంట సేపటికి గానీ నీరు తాగడం మంచిదట… భోజనం తరువాత నీరు తాగడం అంటే విషంతో సమానం అందుకే వెంటనే మంచినీళ్లు తాగకుండా అన్నం తినే ముందు కొద్ది కొద్దిగా నీటిని తీసుకుంటూ ఓ గంట తర్వాత మంచినీటిని తాగండి మంచిది. 


ఒక మనిషి రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలీ అని చెప్పటానికి కూడా ఓ లెక్క ఉంది. ఒకవేళ  మీ బరువు 60 కిలోలు ఉన్నట్లయితే  దాన్ని పదితో భాగించాలి అప్పుడు  ఎంత వచ్చింది…? ఆరు… ఇప్పుడు అందులో రెండు తీసేయండి… నాలుగు వచ్చింది కదా… అంటే… మీరు రోజుకు నాలుగు లీటర్ల నీళ్లు తాగాలన్నమాట… అయితే ఇది ఉదయాన్నా కాదండోయ్ రోజుకు  రోజంతా కలిపి ఇలా చేస్తే  మన దైహిక క్రియలన్నీ సజావుగా సాగుతాయి… బీపీ తగ్గుతుంది… మూత్రపిండాలకు మంచిది.


ఉదయమే రాగిచెంబు నీరు తాగితే, అదీ పరగడుపున తాగితే జరిగే మేలు ఏంటి? ఇదే కదా ప్రశ్న… పెద్ద పేగు శుభ్రపడుతుంది… మలినాలు దేహం నుంచి బయటికి వెళ్లిపోతాయి


మరింత సమాచారం తెలుసుకోండి: