సర్జరీలు, అనుకోని ప్రమాదాలు లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు..ఇలా రకరకాల సందర్భాల్లో మనిషి ప్రాణాన్ని కాపాడేందుకు అత్యవసరంగా కావాల్సింది రక్తం. ప్రమాదంలో ఉన్నవారికి సరైన సమయంలో చేసే రక్తదానం వల్ల ఆ మనిషికి పునర్జన్మనిస్తుంది. అందుకే రక్తదానం చేసి ప్రమాదంలో ఉన్నవారిని ఆదుకోవాలని ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పిలుపునిస్తుంటాయి. అయితే రక్తదానం చేయడం వల్ల రక్తం తీసుకొనే గ్రహీతకు మాత్రమే కాదు, దాతకు కూడా మంచిదే. ఎందుకంటే రక్తం దానం చేయడం వల్ల రక్తదానం చేసిన వారి శరీరంలో ఎప్పటికప్పుడు కొత్త రక్తకణాలు ఏర్పడడంతో పాటు రోగనిరోధక శక్తి మెరుగుపడటం వంటి లాభాలు పొందుతారు. ఈ క్రమంలో రక్తదానం చేసే ముందు, ఆ తర్వాత తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఆహారనియమాలేంటో తెలుసుకుందాం... 

Image result for blood donation tips

బ్లడ్ డొనేషన్ కు ముందు తీసుకోవల్సిన జాగ్రత్తలు... 1/11 పాలకూర, చిక్కుళ్లు, శెనగలు, పప్పుధాన్యాలు వంటి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరం నుండి కొంత రక్తం బయటకు వెళ్లినప్పుడు కొందరిలో విపరీతమైన నీరసానికి గురి అవుతారు. అందువల్ల, రక్తదానం చేసే విషయం ముందుగానే తెలిస్తే..శారీరకంగా, ద్రుడంగా ఉండేందుకు కనీసం వారం ముందు నుండే అందుకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందుకోసం పాలకూర, చిక్కుళ్లు, శెనగలు, పప్పుధాన్యాలు వంటి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మాంసాహారులైతే లివర్, చేపవంటివి తీసుకుంటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

 Image result for blood donation tips

బ్లడ్ డొనేట్ చేసే ముందు రోజు తగినంత విశ్రాంతి తీసుకోవాలి : రక్తదానం చేసే ముందు రోజూ కూడా విశ్రాంతి తీసుకోవడం వల్ల రక్తదానం చేసిన రోజు అలసట, నీరసం నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ముందు రోజు కనీసం 8గంటల గాఢ నిద్ర పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి: బ్లడ్ డొనేట్ చేయడానికి ముందు ఎలాంటి ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఉదాహరణకు పిజ్జా, బర్గర్, బేకరీ పదార్థాలు, అతిగా నూనెలో వేయించిన ఆహారాలు దూరంగా ఉండాలి. కొవ్వు పదార్థాలలోని కొవ్వు జీర్ణమయ్యాక రక్తంలో కలిసి వైద్య పరీక్షలు చేసేందుకు అడ్డంకిగా మారుతాయి. అలాగని పూర్తిగా ఆహారం తీసుకోకుండా రక్తదానం చేయకూడదు. బాగా జీర్ణమయ్యేవి తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా త్రాగాలి: బ్లడ్ డొనేట్ చేసే వారు నీళ్లు ఎక్కువగా త్రాగాలి. ఆల్కహాల్, కార్బోనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి.

Image result for blood donation tips

కొన్ని రకాల మందులకు దూరంగా ఉండాలి:


రక్తాన్ని కాకుండా ప్లేట్ లెట్స్ ను దానం చేసే వారు కనీసం 2 రోజుల ముందు నుండి ఆస్పిరిన్ కలిసిన ముందుల వాడకానికి దూరంగా ఉండటం మంచిది.


శారీరకంగా, మానసికంగా సిద్దంగా ఉండాలి.. శారీరకంగా, మానసికంగా ఉన్నప్పుడే రక్తం దానం చేయడానికి ముందుకెళ్ళాలి.

 

రక్తదానం తర్వాత తీసుకోవల్సిన జాగ్రత్తలు:

రక్తదానానికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అది పూర్తిఅయిన తర్వాత కూడా అన్నే సూచనలు పాటించాల్సి ఉంటుంది. నీరసం, స్ప్రుహకోల్పోవడం వంటి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. అందుకోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు...

 

లిక్విడ్స్ మరియు ఫ్రూట్ జ్యూసులు అధికంగా తీసుకోవాలి: రక్తదానం చేసిన తర్వాత లిక్విడ్స్ మరియు పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యనిపుణుల సలహా. ఎలర్జీ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: బ్లడ్ డొనేషన్ సమయంలో అమర్చే స్ట్రిప్స్ బ్యాండేజ్ ని కొన్ని గంటల పాటు చేతికే ఉంచుకోవడం శ్రేయస్కరం. దీని వల్ల సూది రంధ్రం ద్వారా రక్తం బయటకు రాకుండా జాగ్రత్తపడవచ్చు. స్ట్రిప్ బ్యాండేజ్ చుట్టూ ఉన్న చర్మాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. దీని వల్ల దద్దుర్లు, ఎలర్జీలు రాకుండా ఉంటాయి.

 

బరువులు ఎత్తకూడదు:


బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత బరువుగా ఉన్న వస్తువులను మోయకూడదు. అలాగే శరీరానికి కష్టమైన పనులను కూడా చేయకూడదు. శరీరానికి ఒత్తిడి కలిగించే పనులకు దూరంగా ఉండాలి.

విశ్రాంతి: కళ్లు తిరిగినట్లు అనిపించడం, కళ్ల చుట్టూ చీకటి కమ్మడం వంటివి ఎదురైతే వెంటనే ఉన్నచోటునే కూర్చోవడం లేదా పడుకోవడం చేయాలి. దీనివల్ల సమస్య తీవ్రత ఎక్కువ కాకుండా జాగ్రత్త పడవచ్చు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: