వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరగడంవల్ల, దుమ్ము ధూళిలో పనిచేయడం వల్ల వర్షాకాలంలో చలికాలంలో, చలికాలంలో చలిగాలులను సేవించడంవల్ల, ఫ్రిజ్ లలోని అతిచల్లని పధార్థాలను యేండ్లతరబడి వాడటంవల్ల శరీరంలో అవసరానికి మించిన కఫం ఉత్పన్నమై ఊపిరితిత్తులలోని గాలిగదుల్లో చేరి పైత్యప్రకోపంతో గడ్డ కట్టుకుపోయి శ్వాసకూడా పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల క్రమంగా పిల్లికూతలురావడం, ఊపిరాకపోవడం ఎగశ్వాస, క్షయ, ఉబ్బను సమీకరించి వారందరి సమక్షంలో చెప్పబోయే అల్లంపాకాన్ని తయారుచేసి చూపించి ప్రయోజనాలు ప్రేమతో వివరించండి.


నీళ్ళు కలపకుండా దంచితీసిన అల్లంరసం 400 గ్రా. పాతబెల్లం 70 గ్రా, మెంతిపొడి 5 గ్రా, సొంఠిపొడి 5 గ్రా. దాల్చినచెక్క పొడి 5 గ్రా, పిప్పళ్ళపొడి 5 గ్రా, మిరియాలపొడి 5గ్రా, లవంగాలపొడి 5 గ్రా, నాగకేసరాలపొడి 5 గ్రా, ఆకుపత్రి పొడి 5 గ్రా, ఏలకులపొడి 5గ్రా, సిద్దం చేసుకోండి, కళాయిలో అల్లంరసంపోసి దానిలో మెత్తగా దంచిన బెల్లం కలిపి మరిగిస్తుండగా క్రమంగా పాకమొస్తుంది. పాకం రాగానే పై చూర్ణాలను అందులోవేసి కలిసి పాత్రను దించి పధార్థం చల్లబడగానే ఒక గాజుసీసాలో నిలువజేసుకోండి.


ఈ ఫాకాన్ని వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ రోజూ సేవించవచ్చు, పిల్లలకు ఒకటి నుండి అయిదు గ్రాముల మోతాదుగాను పెద్దలకు 5నుండి 10 గ్రా మోతాదుగాను ఆహారానికి అరగంట ముందు సేవిస్తుంటే ఏ విధమైన శ్వాసకోశవ్యాధి వారిని బాధించలేదు. శ్వాసకోశ సమస్యలున్నవారు కూడా దీన్ని వాడుతూ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చంటున్నారు ఆయుర్వేధ నిపుణులు

మరింత సమాచారం తెలుసుకోండి: