సినిమాల్లో శోభనం రాత్రి అనగా.. తెల్లచీర కట్టుకుని, సిగలో మల్లెపూలు సింగారించుకుని, చేతిలో పాల గ్లాస్‌తో గదిలోకి అడుగుపెట్టే సీన్‌ మన కళ్లముందు కనిపిస్తుంది. అయితే ఆ పాలలో ఏం కలుపుతారు.. అవి ఎందుకు మంచివో మీరూ తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవండి.


పెళ్లి తర్వాత.. ఫస్ట్ నైట్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఫంక్షన్ నిర్వహించడానికి సమయం, రోజు అన్ని చూసి.. మంచి రోజు నిర్ణయిస్తారు. మొదటిరాత్రికి అమ్మాయి, తన భర్తకు ఒక గ్లాసులో  పాలు తీసుకెళ్లి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే కొన్ని ప్రాంతాల్లో సాధారణ పాలను మాత్రమే శోభనం గదిలోకి తీసుకెళ్తారు. మరికొన్ని ప్రాంతాల్లో పాలల్లో కొన్ని మనం నిత్యం వాడే వంటింటి దినుసులను కలిపి శోభనం గదిలోకి పంపుతారు. వీటిని కలపడం వల్ల.. వారి శక్తి, సామర్థ్యం పెరుగుతుంది, వాళ్ల శారీరక సంబంధం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్పైసీ మిల్క్ అంటే.. కుంకుమపువ్వు, పసుపు, పంచదార, మిరియాలు, బాదాం, సోంపును వెచ్చటి పాలలో మిక్స్ చేస్తారు. ఈ మిల్క్‌ను సగం పెళ్లి కొడుకు తాగి, మరో సగం పెళ్లి కూతురుకు ఇస్తుంటారు.


వీటిలో వేసే ఒక్కో రకం దినుసులతో ఒక్కో రకం ప్రయోజనం ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. మిరియాలు, బాదాంను పాలలో కలిపి ఉడికించినప్పుడు.. కొన్ని కెమికల్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. అవి.. లిబిడో స్థాయిని బాగా పెంచుతాయి. అలాగే.. ఎక్కువ సమయం..స్కలనం  అవకుండా.. సహాయపడతాయి.


 పాలు సాధారణంగానే శక్తిని ఇస్తాయన్న విషయం అందరికి తెలిసిందే.. వేడిగా ఉండే పాలల్లో ఆఫ్రోడిసియాక్స్ ఉంటాయి. ఇవి శక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి. రిలాక్స్ అవడానికి, హ్యాపీగా ఉండటానికి కూడా పాలు దోహదపడుతాయి. అంతేకాకుండా ఒకప్పుడు.. పెళ్లికి ముందు, మొదటిరాత్రికి ముందు.. ఒకరినొకరు ఎప్పుడూ కలిసేవాళ్లు కాదు. దీనివల్ల ఫస్ట్ టైం మొదటిరాత్రి రోజు కలిసినప్పుడు భయం, ఆందోళన ఉంటాయని.. పాలు తాగడం వల్ల.. కాస్త సౌకర్యంగా ఉంటుందని మొదటిరాత్రికి పాలు ఇచ్చే సంప్రదాయం వచ్చింది.


 ఇక కుంకుమ పువ్వు, సోంఫును పాలల్లో ఉడికించడం ద్వారా.. రిలాక్సేషన్ ని ఇస్తుంది. అంతేకాకుండా.. కుంకుమ పువ్వు, సోంఫు నుంచి వచ్చే సువాసన.. ఎండోర్ఫిన్స్ లేదా హ్యాపీ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. దీనివల్ల నూతన భార్యా భర్తలు.. హ్యాపీగా ఫీలవడానికి సహాయపడతాయి.
 
అన్ని పోషకాలతో పాటు పంచదారను కలపడం వల్ల.. త్వరగా ఎనర్జీ వస్తుంది. అంటే.. పెళ్లి వేడుకలు, సంప్రదాయాలలో అలసిపోయిన జంట ఈ పాలను తీసుకోవడం వల్ల వెంటనే.. ఎనర్జీ అంది.. ఫస్ట్ నైట్ లో ఎనర్జిటిక్ గా, ఫన్నీగా ఉంటారు. ఎంజాయ్ చేస్తారు. పసుపు, మిరియాలు, సోంపు.. వీటన్నింటిలో.. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇమ్యునిటీని పెంచుతాయి. మొదటిసారి సెక్స్ చేయబోతున్న వ్యక్తి ద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా.. ఇవి ఇమ్యునిటీని పెంచుతాయి.


 అమ్మాయి ఒక గ్లాసు పాలు ఇవ్వడం ద్వారా అందులోని పోషకాలు.. ఆమె చేతి స్పర్శ అతనిలో ఆమెను దగ్గర చేయడానికి సహాయపడతాయి. ఒక గ్లాసు పాలను ఇద్దరూ పంచుకోవడం వల్ల.. చాలా సౌకర్యవంతంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా.. ఇద్దరు దగ్గరవడానికి సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఇంకా మన తెలుగునాట ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. మన ఆచారాల వెనక ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉందని దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: