రాత్రిప‌డుకోవ‌డానికి ముందు త‌డిజుట్టుతోనే ప‌డుకుంటే.. జుట్టు రాల‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. దిండుపై జుట్టు అలా ఇలా తిర‌గ‌డం వ‌ల్ల‌.. స్కాల్ప్ మాయిశ్చ‌రైజ‌ర్ ని కోల్పోతుంది. రాత్రిపూట టైట్‌గా పోనీటైల్ వేసుకోవ‌డం వ‌ల్ల జుట్టు బ్రేక్ అవుతుంది. కుదుళ్లు బ‌ల‌హీన‌మై.. జుట్టు రాల‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. క్లిప్స్ కూడా టైట్ గా ఉండేవి రాత్రిపూట పెట్టుకోక‌పోవ‌డం మంచిది.
  
రాత్రిప‌డుకోవ‌డానికి ముందు జుట్టుని దువ్వుకోకపోవడమే మంచిది. దువ్వడం కంటే మసాజ్ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా మారుతుంది. న్యాచురల్ ఆయిల్ తో రాత్రి మసాజ్ చేయడం వల్ల రాత్రంతా పోషణ అందుతుంది. కావాలంటే ఉదయం దువ్వుకుంటే.. ఆయిల్ జుట్టంతటికీ అందుతుంది.
  
ఒకవేళ మీరు మీ జుట్టుని ఖచ్చితంగా దువ్వుకోవాలి అనుకుంటే.. సరైన దువ్వెన ఎంచుకోవాలి. వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెన ఉపయోగిస్తే.. ఆయిల్ జుట్టంతటికీ అందుతుంది. రాత్రిపడుకోవడానికి ముందు ఎట్టిపరిస్థితుల్లో జుట్టుని కుదుళ్ల నుంచి దువ్వకూడదు. జుట్టుని చిన్న చిన్న భాగాలుగా విడదీసి.. కుదుళ్ల నుంచి కాకుండా.. మధ్యలో నుంచి.. కిందకు దువ్వుకోవాలి.
  
ఒకే పిల్లో క‌వ‌ర్ ని ప‌దే ప‌దే వాడ‌టం, ఎక్కువ రోజులు వాష్ చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల మైక్రోబ్స్ జుట్టుకి హాని చేస్తాయి. చుండ్రు, జుట్టు రాల‌డానికి కార‌ణ‌మ‌వుతాయి. కాబ‌ట్టి శుభ్ర‌మైన పిల్లో క‌వ‌ర్స్ వాడాలి. రాత్రి నిద్రలో అటు ఇటూ పొర్లడం వల్ల జుట్టు విరిగిపోతుంది. అందుకే.. పిల్లో, బెడ్ షీట్ పై జుట్టు రాలి ఉంటుంది. కాబట్టి.. రాత్రి నిద్రపోవడానికి ముందు జుట్టుని కట్టుకోవాలి. దీనివల్ల జుట్టు హెల్తీగా ఉంటుంది.
  
రాత్రి, పగలు రోజంతా ఈ నియమం పాటించాలి. ఏదో ఆలోచిస్తూ. .మనం జుట్టుని చుట్టుడం, ముడేయడం, లాగడం వంటి పనులు చేస్తుంటాం. కానీ.. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా మారి.. జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఈ అలవాటు ఉండే.. వెంటనే మానేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: