సాధారణంగా మనం ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కానీ కొన్ని సమయాల్లో ఏదో ఒక జబ్బు బారిన పడుతుంటాం. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి దానికి తగిన మందు తీసుకొని అప్పటికప్పుడు ఉపశమనం పొందుతుంటాం. అయితే పూర్వం ఎక్కడ పడితే అక్కడ డాక్టర్ల .. క్లీనిక్స్ ఉండేవి కావు. గ్రామంలో ఒక వైద్యుడు ఉంటే అందరూ అతని వద్దకు వేళ్లే వారు అదీ అందుబాటులో లేని వారు మూలికా వైద్యం సహాయంతో నయం చేయించుకునే వారు. అయితే ఇప్పటికే మూలికా వైద్యం, ప్రకృతి వైద్యంతో ఎంతటి జబ్బునైనా నయం చేయవచ్చన్న విషయం ఎంత మందికి తెలుసు. అంతే కాదు మన ఇంట్లో ఉండే ఆహార పదార్ధాలు, మూలికలతో చక్కటి వైద్యం చేయించుకోవచ్చు. 

అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.

జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.

బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.

పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.

ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.

జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: