నిన్నా మొన్నటి వరకు వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరాన్ని. దీంతో డ్రైనేజీలు, మంచినీటి పైపులైన్లు ఒకటయ్యాయి. ఏ నీరు దేంట్లో ప్రవహిస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇక అన్ని జలాశయాల్లోకి కూడా కొత్త నీరు వచ్చి చేరింది. అటు భూగర్భ జలాలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. మరి అవే నీళ్లు మనం తాగితే పరిస్థితి ఏంటి.. 


వర్షాకాలం వచ్చిందటే వాతావరణంతో పాటు తాగే నీరు కూడా చేంజ్‌ అవుతుంది. దీంతో కొత్త కొత్త జబ్బులు అటాక్‌ చేస్తాయి. జలుబు, జ్వరాలు కామన్‌గా వస్తుంటాయి. మరి అలాంటి రావద్దంటే ఏం చేయాలి.? ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నదానిపై కాస్తంతా అవగాహన ఉంటే మనం వర్షాకాలంలోనూ ఆరోగ్యంగా ఉండచ్చంటున్నారు వైద్యులు. నీళ్లు అందరికి అత్యవసరం, అత్యంత ఆవశ్యకం కూడా.. ప్రాణం ఉన్న ప్రతి జీవిలో జీవక్రియలు జరగాలంటే అందుకు నీటి అవసరం చాలా ఉంది. అయితే ఈ రోజుల్లో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం అత్యంత ప్రమాదకర సమస్యగా మారింది. పర్యావరణ కాలుష్యంతో బాటే ఈ మధ్యకాలంలో నీటి కాలుష్యం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. నీరు కలుషితమైనప్పుడు ఆరోగ్య సంరక్షణకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవల్సి వుంటుంది. మనకు వచ్చే రోగాల్లో అధిక భాగం నీటి వల్లే సంక్రమిస్తాయి. తాగు నీటి విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.


కలుషితమైన నీటిని తాగుట వలన అతిసారం, కలరా, టైఫాయిడ్‌, పచ్చకామెర్లు వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం వుంది. వాటర్ పొల్యూషన్ వల్ల టైఫాయిడ్ వస్తుంది. ప్రతి సంవత్సరం వాటర్ పొల్యూషన్ వల్ల 12 మిలియన్స్  ప్రజలు టైఫాయిడ్ బారీన పడుతున్నారు. టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన వారిలో తలనొప్పి, వికారం, ఆకలి లేకపోవడం లక్షణాలు కనబడుతాయి. కలరా ఇది బ్యాక్టీరియా..ఇది చిన్న ప్రేగుల మీద ప్రభావం చూపుతుంది. కలరా సోకిన వ్యక్తిలో తలనొప్పి, బెల్లీ కాంట్రాక్షన్, డయోరియా, వాంతులు,వంటి లక్షణాలు కనబడుతాయి.


కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే మరో కామన్ డిసీజ్ డయోరియా. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ప్రాణపాయ స్థితికి చేరుతుంది. పిల్లల్లో డీహైడ్రేషన్ కారణంగా మరణించడం జరగుతుంది. హెపటైటిస్ చాలా దారుణంగా లివర్ మీద ప్రభావం చూపుతుంది. ఇది కలుషితమైన నీటి ద్వారా లేదా ఆహారం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించడం వల్ల హెపటైటిస్ ఎ కి గురి అవుతారు. పాత నీటి గొట్టాల నుండి వచ్చే నీరు కొన్ని సందర్భాల్లో విషపూరితంగా మారవచ్చు. ఈ నీటిని తాగడం వల్ల, మానవ శరీరంలోని అంతర్గతంగా అవయవాలు డ్యామేజ్ అవ్వొచ్చంటున్నారు డాక్టర్లు.


నీటి కాలుష్యం వల్ల వచ్చే మరో అత్యంత సాధారణ వ్యాధి మలేరియా, దోమల గుడ్లు నీటిలో పెట్టడం వల్ల , ఆ కలుషితమైన నీరు తాగడం వల్ల మలేరియా వస్తుంది. కాబట్టి, కలుషితమైన నీరు తాగకుండా మలేరియా నుండి రక్షణ పొందాలి. కలుషితమైన నీరు తాగడం వల్ల కొన్నిసందర్భాల్లో ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది. ట్రూమర్స్ ఏర్పడటానికి ఈ వైరస్ కారణమవుతుంది. ఇది వివిధ రకాలుగా వ్యాప్తి చెందుతుంది. నిన్నా మొన్నటి వరకు వర్షాలు పడి నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తు తీసుకుని మీరు సేఫ్‌గా ఉండండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: