చాలా మంది గురక సమస్యతో భాదపడుతుంటారు కానీ వాటిని తగ్గించుకోవడం ఎలాగో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇంట్లో ఉండే నిత్యవసర వంట దినుసులతోనే ఈ సమస్య నుండి ఉపశమనం పొందే ఛాన్స్ ఉంది. అవేంటో ఓ సారి చదవండి. గురక అందరిలోనూ ఉంటుంది. పని అలసటను బట్టి, నిద్ర స్థితిని బట్టి గురకలో తేడాలు ఉంటాయి. అయితే ఎలాంటి మన వంటింటి చిట్కాలతో గురకలను తగ్గించటమే కాకుండా, ఆస్తమా వ్యాధి తీవ్రతలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. అందుకోసం ఆవాల నూనె సమర్థవంతంగా పనిచేస్తుంది.