మద్యం సేవించడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మద్యం సీసాలపై, సినిమా హాల్లో తెరపై, బహిరంగ ప్రదేశాల్లో కనబడుతున్నా మద్యం అమ్మకాలు ఏటేటా పెరుగుతున్నాయి కానీ ఏ మాత్రం తగ్గుదల మాత్రం కనబడటం లేదు. మద్యం సేవించడం వల్ల ఎలాంటి వయసులో ఉన్న వారైనా అనారోగ్యానికి గురవుతారనే విషయం అందరికీ విదితమే.అయితే మందు తాగేవాళ్లు ఆ అలవాటును మాత్రం వీడడం లేదు. పైగా ఈ అలవాటు మెదడు పై ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు.