ఆరోగ్యం కొరకు వ్యాయమాలు చేయాలంటే జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటిలోనే ప్రతిరోజూ చేసి ఆరోగ్యం పొందవచ్చు. కాని కొంతమంది వ్యాయామాలు అంటే వివిధ రకాల పరికరాలు ఉండాలని భావిస్తుంటారు. వాటిపై ఎంతో వ్యయం చేస్తారు. కాని ఏ పరికరం లేకుండానే కూడా ఇంటివద్ద వ్యాయామాలు చేసి బరువు తగ్గవచ్చు. శారీరక ఫిట్ నెస్ తేలికగా పొందవచ్చు. మరి పరికరాలు లేని వ్యాయామం ఎలా ? పుష్ అప్ లు సాధారణంగా పుష్ అప్ లపు పురుషులు ఇష్టపడతారు. చిన్నవయసు వారు తమ శారీరక సౌష్టత కొరకు వీటిని రెగ్యలర్ గా చేస్తారు. యువతులు సైతం తమ శరీర పై బాగం అంటే వృక్షజాలు బాగా పెరిగి ఆకర్షణీయంగా కనబడాలని వీటిని చేస్తారు. శరీరం పైబాగ కండరాలు బలపడి మంచి అకారం సంతరించుకోవటానికి ఇంటిలోనే తేలికైన వ్యాయామాలు చేయవయ్చు.  పుష్ అప్ లు చాతీ. చేతి కండారాలకు బాగా పని చేస్తాయి. పుష్ అప్లు గోడకు చేతులు ఆనించి కూడా చేయవచ్చు. ఏ సమయంలో అయినా చేయవచ్చు. అయితే మీ పొట్ట ఖాళీగా ఉండే సమయంలో చేయాలి. టస్కీలు తీయటం బస్కీలు తీయటం అంత తేలికైన వ్యాయామం మరొకట లేదు. కూర్చొనటం, పైకి లేవటం వేగంగా చేయాలి. ప్రతిరోజు చేసే ఈ వ్యాయామాలు మీ శరీరంలోని అధిక బరువును తొలగిస్తారు. కాళ్లకు, తొడ బాగాలకు, నడుముకు ఎంతో బలం చేకూరుంతుంది.  ఈ వ్యాయామం చేయటానికి ఏ పరికరాలు అవసరం లేదు. పొట్ట, తొడలు, నడుము మంచి షేప్ లోకి వచ్చేస్తాయి. కాళ్ళు పైకి ఎత్తుట వెల్లకిలా పడుకొని నడుము బాగం వరకు మీ కాళ్లకు వర్టికల్ గా గాలిలోకి పైకి లేపండి. మరల కిందకు దించండి. ఈ వ్యాయామం మీ కాళ్లకు చక్కటి రక్తప్రసరణ కలిగిస్తుంది. నడుము భాగం, పొట్ట బాగా బలపడుతాయి. కాళ్లను తిన్నగా పైకి లేపటం కష్టమనిపిస్తే, మోకాళ్ల వరకు వంచి పైకి లేపండి. కొద్ది సెకండ్లు దానిని నిలిపి ఉంచండి మరల కిందకు దించి రిలాక్స్ అవండి.  ఈ వ్యాయామం పది లేదా పదిహేను నిమిషాలపాటు ప్రతిరోజు చేస్తే శారీరక ఫిట్ నెస్ చాలా బాగుంటుంది. పొట్ట కండరాలు బలపడి స్లిమ్ అయిపోతారు. మెట్లు ఎక్కుట ప్రతిరోజు మెట్లు ఎక్కటం లేదా దిగటం వంటివి మనం చేసే పనే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మెట్టు ఎక్కండి లేదా దిగండి. మీ జాయింట్ నొప్పులు తగ్గి అవి బలపడతాయి. భవిష్యత్తులో కీళ్లు అరిగిపోయే సమస్య ఉండదు. రక్త ప్రసరణ బాగా జరిగి గుండె వేగంగా కొట్టుకొని ఆరోగ్యాన్ని కలిగిస్తోంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. పొట్ట వ్యాయామాలు- సిక్స్ ప్యాక్ కొరకు ప్రయత్నిస్తున్నారా ? ఏ పరికరం దానికి అవసరం లేదు. వెల్లకిలా పడుకొండి. మీ మోకాళ్లను తీసుకు వచ్చి చాతీ బాగానికి తగిలించి వీలైనంత మేరకు పొట్టను ఒత్తిడి. ఈ వ్యాయామంలో మీ పొట్ట, తొడ భాగాలు, వెన్నెముక, చేతులు ఎంతో బలపడతాయి. జిమ్ కు వెళ్లి ఎంతో సొమ్ము వ్యయం చేయకుండా, ఇంటిలోనే ఏ పరికరం లేకుండా, ఈ వ్యాయామాలు చేసి మీ శారీరక సౌష్టవం కాపాడుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: