ప్రకృతి ప్రసాదించిన వర ప్రదాయిని కొబ్బరి చెట్టు.  భగవంతుడిని మనం నిత్యం ఈ కొబ్బరికాయ సమర్పిం చుకొని పూజిస్తాం. అంటే ఇది భతవంతుడికి మహా ప్రీతిపాత్రమైనది.. అంతే కాకుండా ఈ కొబ్బరి కాయ వలన మనకు ఎన్నో రకాలుగా ఉపయోగాల ఉన్నాయి.   పై పీచు మొదలుకొని లోపలి గుజ్జు వరకు పనికొస్తుంది కాబట్టె దీన్ని సంపూర్ణ ఫలం అన్నారు.  శుభకార్యాల సమయంలో కొబ్బరికాయ తప్పనిసరి అంటే ఎంత ప్రాముఖ్యముందో ఊహించుకోవచ్చు. ముందు పై పీచునంతా ఒలిచివేయాలి, మూడు కళ్లతో ఉన్న కొబ్బరికాయ కన్పిస్తుంది.  దీన్ని పగలకొడితే లోపల కొబ్బరినంటుపెట్టుకొని ఉండే ముదురురంగు పొర మరొకటి ఉంటుంది.  ఆ తర్వాతే తెల్లటి కొబ్బరి కన్పిస్తుంది, కొబ్బరికాయ కొనేటపుడు కొంత జాగ్రత్త తీసుకోవాలి.  ఏడాది పొడవునా ఇవి దొరికినా ఎక్కువగా ఏప్రిల్- సెప్టెంబర్ నెలల మధ్య దొరుకుతాయి.  కాయ పెద్దగా ఉండి కదిలిస్తే లోపలి నీటి శబ్ధం ఎంచుకోవాలి.  కళ్లవద్ద తడిగా ఉంటే వాటిని ఎంచుకోవద్దు, ఎందుకంటే కొన్ని కుళ్లిపోయే ప్రమాదం కూడా ఉండవచ్చు. కొబ్బరికాయలు రూమ్ టెంపరేచర్ బట్టి 25 రోజులు వరకు పాడు కాకుండా ఉంటాయి. 

          కొబ్బరికాయ ఎన్ని రకాలు దొరుకుతున్నాయి. తురిమిన కొబ్బరి, పొడి, క్రీము, కొబ్బరి పాలు.. ఇలా రకరకాలుగా మనం నిత్యం వంటల్లో, మరియు ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నాం.

తురిమిన కొబ్బరి : తురిమి కొబ్బరి కొంచెం పెద్ద సైజులో తురిమి ఎండబెట్టిన రకం.  పలుచగా, పొడవుగా తురిమిన వాటిని చాలా భద్రంగా గాలి చొరబడని సీసాల్లో గానీ, ఫ్రిజ్ లో కాని భద్రపరచాలి.

కొబ్బరి క్రీమ్ : ఒక వంతు నీటికి నాలుగు వంతుల కొబ్బరి కలిపి తయారు చేస్తారు. దీనిలో కొవ్వు తీసిన వెరైటీ కూడా దొరుకుతుంది.

క్రీమ్ వంటి కొబ్బరి : కొబ్బరినంతా క్రీములా మార్చి గడ్డలుగా చేసి అమ్ముతారు. కావలసినప్పుడల్లా ఫ్రీజ్ నుంచి తీసి వాడుకోవచ్చు.

కొబ్బరి పాలు : సమపాళ్ల లో కొబ్బరి, నీరు కలిపి ఆ మిశ్రమాన్ని బాగా వడకట్టి, కొబ్బరి పాలు తయారు చేస్తారు. పలు స్వీట్లు, వంటకాల్లో ఉపయోగిస్తారు.

కొబ్బరిపాల పొడి : స్ర్పే, డ్రయింగ్ టెక్నాలజీ ద్వరా తయారు చేస్తారు.  దీన్ని గోరువెచ్చటి నీటిలో కలిపితే కొబ్బరిపాటు రెడీ

 ఈ విధంగా కొబ్బరితో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: