కావలసిన పదార్ధాలు :

గోంగూర    :  నాలుగు కట్టలు            ఎండు మిర్చి          : 25 కాయలు

మినపప్పు :  1/2  చెంచా                పచ్చశనిగ పప్పు     : తగినంత

నూనె       : 1 కప్పు                           జీలకర్ర, మెంతులు   : కొద్దిగా

ఆవాలు     : సరిపడినంత                ఉప్పు, పసుపు       :  సరిపడినంత

తయారు చేయు విధానం :

మొదట గోంగూరని బాగా కడిగి పక్కన పెట్టాలి.  నూనె బాండీలో కాగిన తర్వాత పచ్చిశనిగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర దోరగా వేయించి చివరగా ఎండు మిర్చి వేసి దింపాలి.  రోట్లో లేదా  మిక్సిలో ఈ వేయించిన వాటికి చింతపండు, ఉప్పు, పసుపు చేర్చి మెత్తగా నూరాలి. మిగిలిన నూనెలో గోంగూర వేసి బాగా కలియతిప్పుతూ మెత్తగా అయ్యేంత వరకూ ఉంచాలి.  దీనిని రోట్లో నూరిన పొడితో బాగా దంచి కలపాలి.  చివరగా నూనె వేసి అందులో ఇంగువ వేసి మరల ఈ నూనెని పచ్చడిలో వేసి బాగా కలపెట్టాలి.  ఆ తర్వాత తినండీ దీని రుచి అద్భుతం అంతే కాకుండా  దాదాపు వారం రోజులు నిలువ ఉంటుంది ఈ పచ్చడి.

మరింత సమాచారం తెలుసుకోండి: