చురుకుగా ఆలోచించడం… అన్నిట్లో షార్ప్ నెస్ చూపించడం మన చేతుల్లో ఉండదు అనుకుంటాం. కానీ మనం తీసుకునే ఆహారంలో మాత్రం ఉంటుంది. తిన్న తిండిని బట్టే ఒంటికి కండ పడుతుందంటారు. అలానే మెదడుకి కూడా చురుకుదనం వస్తుంది. అది ఎలాగో తెలుసా… చాలా కంపెనీలు న్యూట్రీ డ్రింక్స్ పేరుతో మెదడు చురుకుదనం గురించి కబుర్లు చెబుతాయి. అవేవీకావు వాల్ నట్ తింటే చాలు మీ మెదడు కణాల్లో ఉత్సాహం రెట్టింపవుతుందన్న విషయం తెలుసుకోండి. ఇది ఫారిన్ ఫుడ్, కాస్ట్లీ ఫుడ్ అని కొట్టిపడేస్తారు. కానీ వాల్ నట్ లో మెదడుకి సంబంధించిన పోషకాలు ఉంటాయనేది పచ్చివాస్తవం…


చూడటానికి మెదడు ఆకారాన్ని పోలి ఉండటం వాల్ నట్ ప్రత్యేకత. అందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అనుకోవడం పొరబాటు. వాల్ నట్ లో మెదడుకి ఔషధంలా పనిచేసే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల శాతం ఎక్కువ. మెదడు పనితీరుని ఉత్సాహపరచడంలో ఈ ఆమ్లం కీలకపాత్ర పోషిస్తుంది. మానసిక ఒత్తిడి, అభీష్ట క్షీణత, నిరుత్సాహం వంటి రుగ్మతలపై ఒమెగా-3 ప్రభావం చూపిస్తుంది. వాల్ నట్ తినడం వల్ల ఈ అవలక్షణాలన్నిటికీ చెక్ పెట్టవచ్చు. గుండెకి హానిచేసే కొవ్వు పదార్ధాల్ని నియంత్రించడంలోనూ వాల్ నట్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.


వాల్ నట్ లో మాంగనీస్, కాపర్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి మూలకాలు ఉంటాయి. వీటితో పాటు యాంటి ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్, ఇ విటమిన్ పుష్కలంగా లభిస్తాయి. నల్ల వాల్ నట్ లో ఈ పోషకాల శాతం మరింత ఎక్కువ. ఇందులో కణ వ్యవస్థకి మేలు చేసే ఎమినో యాసిడ్ కూడా ఉండటం విశేషం. అంటే తగినంత పరిణామంలో మన ఆహారంలో వాల్ నట్ తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: