వంటలకు ఘుమఘమలను అందించి రుచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగించడంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాటిలో చెప్పుకోతగ్గది మునగ, మునగకాడల్ని చారు, సాంబారు, కూర, పచ్చడి సూప్ వంటివెన్నో రకాల వంటకాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ కాడలతోటే కాకుండా మునగ ఆకును వంటు చేసుకుని తినడం వలన శరీర ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తుంది. అయితే, ఇప్పుడు కాడలు వాడినంతగా ఆకును వాడటం లేదనే చెప్పాలి. దీని లేత ఆకులు కూరగాను, పువ్వును మామూలు ఆకుకూర వండిన మాదిరిగానే వండవచ్చును.


మునగాకు కాలేయంలో చేరిన విష పధార్థాలను హరిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది. కొంతమంది పిల్లలు రాత్రిళ్లు పక్క తడుపుతూంటారు. అలాంటివారికి ఈ మునగాకును పెసరపప్పుతో కలిపి కూరగా వండి పెడితే అద్భుత గుణాన్నిస్తుంది. వాత వాయువులను, కడుపునొప్పి, అల్సర్లు, పేగు పూతలు పోగొడుతుంది. ఆముదం మునగాకు కలిపి ఉడికించి కాపడం పెడితే వాత నొప్పులు, కీళ్లనొప్పులు, బెణుకు నొప్పులు తగ్గుతాయి.


ఆముదం, మునగాకు కలిపి ఉడికించి గుడ్డలో మూటకట్టి గవదబిళ్లపై కడితే తగ్గిపోతాయి. మునగాకు రసం తీసి గ్లాసులో తేరబెట్టి దానికి తేనె కలిపి తాగితే గొంతులో పుండ్లు కంఠరోగాలు, కాలేయంలోని అల్సర్లు తగ్గుతాయి. కాకపోతే మునగాకు గ్రామాల్లో లభ్యమయినంతగా పట్టణాలలో లభ్యం కాకపోవచ్చు. కొంత ఆకుల్లో ఉండే విలువలే మునగకాయల్లోనూ ఉంటాయి.


ఇవి పట్టణాల్లో దొరుకుతాయి. కనుక, వాటినైనా తీసుకునే విధంగా తీసుకుంటుంటే ఫలితాలు పొందవచ్చు. ఉడికించే వాటిల్లో వేయడం వలన వాటిలోని సారం అంతా ఇవతలకి వస్తుంది. అది తీసుకుంటే శరీరానికి చక్కగా వంట పడుతుంది. మునగ ఆకైనా, కాడైనా ఆరోగ్యానికి మంచిది

మరింత సమాచారం తెలుసుకోండి: