మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం సమృద్దిగా ఉండాలి.   మనిషి బరువుకి వయసుకి తగినంత రక్తం లేకపోతే..రక్తహినత వంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.   ప్రతి మనిషిలోనూ మలంద్వారా రోజూ అంటే, రక్త కణాలకి అవసరమైన ఇనుపదాతవు 0.6 మిల్లీ గ్రాములు బయకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆడవారిలో ఋతురక్తం ద్వారా మరికొంత పోతూ ఉంటుంది. అందువల్ల మనం ఇనుము ఉన్న ఆకుకూరలు, పాలు, ఆహారంలో తీసుకుంటూవుండాలి. ఈ రక్తక్షీణం పలురకాలుగా ఉన్నా చిరకాలం నుంచి ఏనీమియా ఉన్నావారు రక్త పరీక్షలతోపాటు కిడ్నీలు, లివరు, స్ల్పీన్ వ్యాధులు ఉన్నాయోమోనని సరిచూసుకోవాలి.


ధీర్ఘకాలంగా ఉన్న అజీర్ణ, జిగట విరేచనాలు, దేనికైనా బలమై మందులు వాడటం వల్ల కూడా ఎనీమియా రావచ్చు. జాగ్రత్తగా గమనించాలి. కాళ్ళు లాగటం వల్ల కూడా ఎనీమియా రావచ్చు. జాగ్రత్తగా గమనించాలి. కాళ్ళు లాగటం, ఆకలి తగ్గటం, చర్మం, ముఖం పాలివోవడం, విపరీతమై నీరసం, ఆయాసం, బిపి తగ్గటం, గుండెదడ, విరేచనం రంగుమారటం వంటివి ముఖ్య లక్షణాలు. ఈ వ్యాధులు రాకుండా చూసుకుంటూ చప్పకుండా జరిగే ప్రమాదాల బారినపడకుండా మనం నిత్యం తీసుకునే ఆహారంలో గోంగూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర, క్యారెట్, బీట్ రూట్, పాలు, పప్పుదినుసులు మన ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి.


ఆహారం హితంగా, మితంగా సమయం దాటకుండా తీసుకుంటే అది జీర్ణమై, సక్వమై శరీరానికి ఒంటబడుతుంది. వేపచెక్కను ఉండబెట్టి పొడిచేసి పావుతులం చొప్పున ఆవునెయ్యితో కలిపి తింటే రక్తం వృద్దిచెదుతుంది. ఆవుపాలలో పటికబెల్లంపొడి, యాలకుల పొడి కలిపి రాత్రిపడుకునేముందు తీసుకుంటే రక్తవృద్దే కాదు, చక్కని నిద్రకూడా పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: