చారులో మిరియాల పొడివేసి, నెయ్యితో పోపు పెట్టి... దాంతో భోజనం చేస్తే... కఫం తగ్గుతుంది. ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, ఆ రసంలో ఒక స్పూన్ తేనె కలిపి కానీ, తాగితే జలుబు తగ్గుతుంది. బెల్లంలో మిరియాల పొడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని పడుకునే ముందు తీసుకుంటే జలబు తగ్గుతుంది.

పసుపు కొమ్ములను కాల్చి దాని పొగ పీల్చాలి. రాత్రి భోజనం తర్వాత ఆరు గ్రాముల వెల్లుల్లి రసం బెల్లంతో కలపి తినాలి. ఉసిరిక పొడి, శొంఠి, పిప్పల్లి, మిరియాల పొడి, నెయ్యి బెల్లంలో కలిపిరోజూ తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. చిన్నపిల్లలకు నిమ్మగడ్డి నూనెను ఛాతీమీద మెడలమీద రాసి, వేచ్చటి కాపడం పడితే కఫం కరిగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: