మనకు దొరుకుతున్న వాటిలో అన్నంటికన్నా ఎక్కువగా బలాన్నిచ్చే పధార్థం ఏదని ఎవరైనా ఠక్కున అడిగితే కాసేపు తడుమొకొని, విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ గురించి చెప్తుంటాం మనం ! ఎందుకంటే, మన బుర్రకి ‘ ఉప్పు ’ అనే విషయం తట్టదు కాబట్టి ! ఉప్పు అన్ని పధార్థాల కంటే ఎక్కువ బలాన్ని ఇచ్చేదని, వీర్యపుష్టిని కల్గిస్తుందని, లైంగిక కార్యం తర్వాత అలసటని పొగుడుతుందని మన ఊహించివుండం ! ఉప్పు లేకపోతే శరీరం తుక్కుతుక్కు అన్నమాట ! ఎండదెబ్బ కొట్టినపుడో, విరేచానాలు, వాంతులు అవుతున్నప్పుడో శరీరంలోంచి ఉప్పు నిల్వలు వెళ్లిపోతాయి. కాబట్టి ఉప్పుని తిరిగి శరీరంలో ప్రవేశపెట్టాలి కాబట్టి మనం ఉప్పు పంచదార కల్సిన ఓ,ఆర్.ఎస్ నీల్లని తాగుతున్నాం.. అంతేనని చాలామంది అభిప్రాయం! కానీ, శరీరానికి పుష్టిని కల్గినంచే పధార్థాలలో ఉప్పు ఉత్తమమైందని మనలో చాలామందికి తెలియదు.!!


1. ఉప్పు వలన తక్షణ బలం కలుగుతుంది.

2. ఉప్పు వలన వీర్యపుష్టి కల్గుతుంది.

3.ఉప్పు వలన జీర్ణశక్తి పెరుగుతుంది. తీసుకున్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది.

 4.నెయ్యిలో ఉప్పు వేసి బాగాకాచి, అన్నంలో ఆ ఉప్పునేతిని వేసుకొని తినండి కడుపులో మంట అన్నం తినగానే కడుపునిండిపోయి వెంటనే ఆకలి అవుతున్నట్లుగా వుండే లక్షణం సాధారణం గ్యాస్టట్రబుల్ వ్యాధిలో ఉంటుంది. నెయ్యిలో ఉప్పువేసి కాచుకొని అన్నంలో తింటే ఈ పైత్యపు బాధలన్నీ తగ్గుతాయి.  

5. నీళ్ళలో ఉప్పువేసి బాగామరిగించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నపుడు అంగిటలో పుక్కిట పట్టండి. గొంతులో పుళ్లు తగ్గుతాయి. టాన్సిల్స్ లో వాపు తగ్గుతుంది. అంగిటిలో నీరు పట్టిన పుండు కూడా తగ్గుతుంది. గొంతు పూసింది అంటారే ఇది పుక్కిట పడితే ఆ పూతపోతుంది.  

6. వేడి అన్నంలో మెత్తటి ఉప్పు వేసికొని, నెయ్యి కలుపుకొని రెండు ముద్దలు ముందుగా తిని ఆ తర్వాత అన్నం తినండి అన్నంతిన్న తరవాత వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది.  

7. ఉప్పును ఏదొక ఒకింత అధికంగా తీసుకొంటే విరేచనం ఫ్రీగా అవుతుంది.  

8.వాతవ్యాధులన్నింటిలోనూ ఉప్పు మంచిదే. అయితే, నొప్పులు వాపులు తగ్గేందుకు వాడే బిల్లం వల్ల కాళ్లకుగాని, శరీరంలోని ఇతర భాగాల్లోగానీ నీరు వస్తుంది. ఇలా నీరు పట్టినప్పుడు ఉప్పును వేయించి గుడ్డలో మూటగట్టి కాపు పెట్టుకోండి. ఉప్పు కాపువలన నొప్పి వాపు, నీరు మూడు తగ్గుతాయి.  

9. శరీరానికి నీరు పట్టినపుడు, బీపీ ఎక్కువగా వాడ్డున్నపుడు ఉప్పుని కడుపులోకి తీసుకోవడం బాగా తగ్గించేయాలి.

10. కార్టికోస్టిరాయిడ్స్, హార్మోన్లు ఎక్కువగా వాడ్తున్నప్పుడు తప్పనిసరిగా ఉప్పుని తగ్గించేయాలి. ఈ మందులు వాడుతున్నవారు ఉప్పు మానకపోతే శరీరానికి నీరు వస్తుంది.  

11. నెత్తురుతో కూడిన వాంతులు అవుతున్నప్పుడు గ్లాసుడు చన్నీళ్ళలో ఉప్పుకలిపి తాగించండి. అసలే వాంతులౌతుంటే ఉప్పునీళ్లు కలపమంటారేమిటీ.... అనకండి. ఉప్పు నీరు లోని వెళ్లడం వలన రక్తం పడటం ఆగుతుంది.

12. ఉప్పు తినమన్నాం కదా అని అతిగా తినకండి ఉప్పు మితిమీరి తినే వారికి ఎముకలు గట్టి పడవు. వీర్యంలో పట్టు తగ్గుతుంది.

 13. ఉప్పు ఎక్కువగా వున్న వంటలు తినవలసివచ్చినప్పుడు – నెయ్యిగానీ, చలవచేసే ఏ ఆహారపధార్థాన్నిగానీ, మజ్జిగగానీ, తీసుకొంటే ఉప్పు వలన కలిగిన దోషం విరిగిపోతుంది. నిమ్మరసం కూడ మంచిదే!

మరింత సమాచారం తెలుసుకోండి: