మనం ఆరోగ్యం కోసం నిత్యం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాం. కానీ బయట ఉన్న పోల్యూషన్ వాతావరణం తో అప్పుడప్పుడు వ్యాధుల బారిన పడుతుంటాం.  అయితే మన ఇంట్లో ఔషదాలతో చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.  పురాణకాలం నుంచి ఈ ఔషదాలకు ఎంతో ప్రాచుర్యం ఉంది.  ఇక మన ఇంట్లో ఉండే వస్తువులతో ఔషదం తయారు చేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.  మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాట‌న్నింటికీ స‌ర్వ‌రోగ నివార‌ణి ఆయుర్వేదంలో ఒక‌టి ఉంది. దీనిని మీరే ఇంట్లోనే తయారు చేసుకోవ‌చ్చు. దీనిని తయారు చేయటం చాలా సులభం. 


కావాల్సిన‌వి పదార్ధాలు:
250 గ్రాములు మెంతులు
100 గ్రాములు వాము
50 గ్రాములు నల్ల జీలకర్ర


తయారు చేయు విధానము: మొదటగా పైన తెలిపిన మూడు పదార్దాలను శుభ్రం చేసుకోవాలి. వీటిని వేరువేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయండి. మెంతులు, వాము, నల్ల జీలకర్రలని కలిపి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఉపయోగాలు : ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్ళలో 1 చెంచాడు చూర్ణం(పొడి)ని కలిపి తాగాలి. వేడి నీళ్ళలో మాత్రమే ఈ పొడిని వేసుకుని తాగాలి. ఈ చూర్ణం తాగిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోరాదు. అన్ని వయసుల వారు స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఈ చూర్ణంని తాగవచ్చు. ప్రతి రోజు ఈ చూర్ణంని సేవించడం వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వ‌చ్చేస్తాయి. 80 – 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమ ఫలితాలు రావ‌డాన్ని మీరు గమనించగలరు. అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: