స్వర్గలోకంలో అమృతభాండం ఒలికి జారిన అమృతపు చుక్క భూమి మీద పడి తాళ వృక్షమై మొలిచిందట. ఈ మాటలో ఎంత నిజముందో తెలియదు కానీ.. తాటిచెట్టు కల్పవృక్షమని.. తాటికల్లు దివ్యౌషధమని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఒక మోతాదులో సేవిస్తే.. తాటికల్లు ఆయురారోగ్యాలకు రక్షణగా నిలుస్తుంది. ఇది సాక్షాత్తు జాతీయ పోషకాహర సంస్థ చెబుతున్న నిజం. 


తెలంగాణ పల్లెల్లో విరివిగా లభించే తాటికల్లుపై జాతీయ పోషకాహార సంస్థ ఎన్నె పరిశోధనలు చేసి. అందులోని పోషక విలువలను వెల్లడించింది. ఇటీవల జాతీయ స్థాయిలో విడుదల చేసి కాంపోజిషన్ బుక్ లో తాటికల్లులో పోషకాల గురించి వివరించింది. తాటికల్లులో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉన్నాయని.. ఇవి ఎముకల పటిష్టానికి, రక్త వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపింది.

ఇందులోని మినరల్స్, విటమిన్స్ ఆరోగ్య సమతుల్యతకు దోహదం చేస్తాయని పేర్కొంది. తాటికల్లులో ఉండే ఫ్యాంటీ యాసిడ్స్ శరీరంలో కొవ్వు పెరగకుండా నిరోధిస్తాయట. తాటికల్లులో ఉండే ఫైబర్.. షుగర్ వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తుందట. ఇందుటోని విటమన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుందట.


తాటికల్లుకు సంబంధించిన డాటా అంతా జాతీయ పోషకాహార సంస్థ కాంపోజిషన్ బుక్ లో పొందుపరిచింది. తాటికల్లులో వాటర్ సాల్యూబుల్ విటమన్స్ లో థయామిన్, రిబోప్లేవిన్, నియాసిన్, ఫ్యాంటాసిడ్ విటమిన్లు ఉండగా.. కెరోటెనాయిడ్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి.


కల్లు అనేది మత్తు పదార్థమని అనేక దుష్ప్రచారాలు జరిగాయి. తెలంగాణలో గతంలో చిన్న పిల్లలు కూడా దీన్ని వాడేవారు. కానీ కాలక్రమంలో పట్టణాలకు చేరిన కల్లు వ్యాపార వస్తువైంది. అందులో కల్తీ జరుగుగతుండడంతో..  క్రమంగా ప్రజలకు దూరమైంది. అయితే మార్కెట్ లో లభించే ఇతర పానీయాల కన్నా కల్లు ఎంతో మేలు అని ఇప్పుడు మరోసారి రుజువైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: