దానిమ్మ పండు జావతో కిడ్నీ రోగాలకు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. దానిమ్మ పండులో యాంటియోయాక్సిడెంట్స్ ఉన్నందున కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఎంతగానో మేలు చేస్తుందని ఇజ్రాయేల్‌కు చెందిన వెస్టర్న్ గలిలీ మెడికల్ సెంటర్ నిర్వహించిన పరిశోధనలో తేలింది.  కిడ్నీ వ్యాధిగస్తులు దానిమ్మ పండు జ్యూస్‌ తీసుకోవడం ద్వారా రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గుముఖం పట్టడాన్ని నియంత్రిస్తుందని గలిలీ మెడికల్ సెంటర్ పరిశోధకులు తెలిపారు.  


రోజూవారీగా దానిమ్మ పండు రసాన్ని సేవించడం ద్వారా హృద్రోగ వ్యాధులు, హై కొలెస్ట్రాల్, రక్తపోటు, కిడ్నీ సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. డయాలసిస్ వ్యాధిగస్తులు వారానికి మూడు సార్లు దానిమ్మ పండు జ్యూస్ తీసుకోవాలని ఆ స్టడీలో తెలిసింది. ఒక ఏడాది పాటు దానిమ్మ పండు రసం తీసుకున్న వారిలో రక్తపోటీ 22 శాతం తగ్గిందనే విషయాన్ని గమనించినట్లు పరిశోధకులు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: