సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా ముక్కు, గొంతు కి సంబంధించిన వ్యాదులు ఎక్కువగా వస్తాయి.  కొంత మంది ఆస్తమా ఉండటం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు.  మరి కొంత మందికి అధిక వేడి ఉండటం వల్ల కూడా బాగా జలుబు చేయడం జరుగుతుంది.  అయితే ఇలాంటి పరిస్థితి వచ్చినపుడు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధుల నుంచి బయట పడవొచ్చు. 


ముక్కు, గొంతు భాగాలు ఇన్ఫెక్షన్ కి గురయినప్పడు అక్కడ గూడు కట్టుకున్న శ్లేష్మం, కఫం బాక్టీరియాతో కూడుకుని ఉంటాయి. ఈ పధార్థాలని మింగినా లేదా అవే ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినా ఊపిరితిత్తులు కూడా ఇన్ఫేక్షన్ కి గురి అవుతాయి.   కోమాస్థితిలో గాని, అతి ధీర్ఘ నిద్రాస్థితిలోగానీ ఊపిరి ద్వారా జీర్ణరసాలు, విషపదార్థాలు, మందుల వల్ల ఊపిరితిత్తుల్లోకి చేరే విషవాయువులూ కూడా ఊపిరితిత్తుల్ని దెబ్బతీస్తాయి, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆహారపధార్థాల తునకలు కూడా గొంతు నుండి వాయునాళంలోకి ప్రవేశించి తీవ్రనష్టాన్ని, ఉద్రేకాన్ని కలుగజేస్తాయి. దీని వలన ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: