సాదారణంగా చలికాలం లో ముక్కు, గొంతు కి సంబంధించిన ఇబ్బందులు తలెత్తుంటాయి. అంతే కాదు ఈ మద్య రోడ్లపై వస్తున్న దుమ్మూదూళి తో కూడా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి.  మనం రోడ్డుపై వెళ్లే సమయంలో ముక్కుకు మాస్క్ కానీ గుడ్డ కానీ కట్టుకొని వెళ్లడం ఎంతో మంచిది. 


ఇక ముక్కు, గొంతు భాగాలు ఇన్ఫెక్షన్ కి గురయినప్పడు అక్కడ గూడు కట్టుకున్న శ్లేష్మం, కఫం బాక్టీరియాతో కూడుకుని ఉంటాయి. ఈ పధార్థాలని మింగినా లేదా అవే ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినా ఊపిరితిత్తులు కూడా ఇన్ఫేక్షన్ కి గురి అవుతాయి.  


కోమాస్థితిలో గాని, అతి ధీర్ఘ నిద్రాస్థితిలోగానీ ఊపిరి ద్వారా జీర్ణరసాలు, విషపదార్థాలు, మందుల వల్ల ఊపిరితిత్తుల్లోకి చేరే విషవాయువులూ కూడా ఊపిరితిత్తుల్ని దెబ్బతీస్తాయి, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆహారపధార్థాల తునకలు కూడా గొంతు నుండి వాయునాళంలోకి ప్రవేశించి తీవ్రనష్టాన్ని, ఉద్రేకాన్ని కలుగజేస్తాయి. దీని వలన ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: