మన దేశంలో వేపచెట్టును దివ్యవృక్షంగా భావిస్తూ పూజిస్తారు. వేప పుష్పాలు చిన్నగా, తెల్లగా, తీయని పరిమళముతో కూడి ఉంటాయి. వేరు, బెరడు, పత్రములు, పూవులు, విత్తనాలు, అన్నికూడ ఔషద బలాన్ని ఇస్తున్నప్పటికీ,. ఆకులు అధిక అధిక ఔషద ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. చర్మవ్యాధుల నివారణకు వేప పెట్టింది పేరు. వేప సాధారణంగా వేగంగా పెరిగే వృక్షము.

Image result for వేప చెట్టు బెరడు

వర్షాభావ పరిస్థితిని తట్టుకుంటుంది. బెరుడు గరుకుగా, నల్లగా ఉంటుంది. జిగురు పదార్థము ముద్దలుగా దీనిపై ఏర్పడును. దీనిని ఈస్టిండియా గమ్ అని కూడా అంటారు. నాణ్యమైన కలప లభించడం వల్ల దీనని గృహ నిర్మాణము, గృహోపకరణ సామాగ్రికి, సేద్య పనిముట్లకు వాడుతారు. ఈ కలపలో కీటక నాశన రసాయనాలు ఉన్నందున చెదలు పట్టుటగానీ, పుచ్చిపోవడం గానీ జరుగదు.

Image result for వేప చెట్టు ఉపయోగాలు

బెరడును టానిక్ గా వాడుతారు. జిగురును బట్టల నే0తకు సంబంధించిన పరిశ్రమలలో, రంగులు, అద్దకం పరిశ్రమలలో ఉపయోగిస్తారు. అలాగే కొన్ని రకాల మందులలోనూ ఉపయోగిస్తారు. విత్తనాల నుంచి తైలాన్ని తీస్తారు. దోమలను పాదద్రోలేందుకు కాడా దీన్ని వాడుతారు. వేప చెక్కను, వేప పిండిని క్రిమిసంహారిక చెట్లకు వాడుతారు. పచ్చి ఆకులను ఎరువుగా కూడా వాడుతారు. వేప బ్యాక్టిరియాను, వైరస్ ను నశింపజేస్తుంది.

Image result for వేప చెట్టు ఉపయోగాలు

ఆయుర్వేద మందులలో సైతం దీనిని విరివిగా ఉపయోగిస్తారు. ఎక్కువగా వేపనూనెను చర్మవ్యాధులకు వాడుతారు. అలంకార ద్రవ్యాలలోనూ, సబ్బులు, శాంపుల తయారిలోనూ, వాడుతారు. పళ్లకు వేప పుల్లలను వాడటం వల్ల చిగుళ్లు గట్టిపడి నోటి దర్వాసన పోతుంది 

మరింత సమాచారం తెలుసుకోండి: