ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న క్యాన్సర్ మరణాలలో అధికభాగం ఊపిరితిత్తులు క్యాన్సర్ వల్లనే అని వైద్య పరిశోధకులు తెలుపుతున్నారు. ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కారణం 90 శాతం పొగాకు వాడటం వల్లనే అనేది పరిశోధకుల వాదన..అయితే ఇప్పటి పరిస్థితులని దృష్టిలో ఉంచుకుని వైద్య శాస్త్రవేత్తలు చెప్తున్నా దానిప్రకారం పొగాకు వలన ఈ క్యాన్సర్ ఎలా అయితే వ్యపిస్తోందో..వాయు కాలుష్యం వల్ల కూడా ఈ వ్యాధి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నాడని హెచ్చరిస్తున్నారు.

 

ఎక్కువ రోజులు దగ్గు తో బాధపడుతుంటే, తేలిగ్గా తీసుకోవద్దు.  లంగ్ కాన్సర్ తో బాధపడేవాళ్ళు ఎక్కువ శాతం దగ్గుతుంటారు.వీటివలన ముఖ్యంగా దగ్గు ఎక్కువగా వచ్చి దాని ద్వారా రక్తం వస్తుంది..ఈ సమయంలో అశ్రద్ద చేయడం మంచిది కాదు.. ఒకవేళ ఈ కాన్సర్ కనుక వేరే బాగాలకి సోకితే వేరే సమస్యలు వచ్చే అవకాసం ఎక్కువగా ఉంది..అందులో భాగంగానే కీళ్ళ నెప్పులు రావడం వెనక భాగంలో నెప్పులు రావడం జరుగుతుంది.

 

ఊపిరితిత్తులు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు పరిశీలిస్తే..

మానకుండా దగ్గు వస్తూనే ఉంటుంది..అంతేకాదు దీని వలన ఒక్కోసారి ఊపిరి ఆగిపోయిందా అన్నట్టుగా ఉంటుంది.దగ్గుతున్నప్పుడు రక్తం పడటం..ఛాతీలో నొప్పి ...ఈ క్యాన్సర్ కనుకా మెదడుకి పాటినప్పుడు తలనొప్పి వస్తుంది. అలాగే వాంతులు క్రమంగా వస్తున్నా..బరువు తగ్గుతున్నా సరే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

ఈ వ్యాధి ముదిరిపోకుండా ముందుగానే గుర్తించగలిగితే అనేకరకాలైన పద్దతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పూర్వం  ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిన ఎటువంటి రోగికి అయినా సరే ఒకేలాంటి చికిత్స చేసేవారు. ఇప్పుడు మాత్రం రోగి వ్యాధిని బట్టి..రోగం స్థితిని బట్టి ప్రత్యేకంగా చికిత్సచేస్తున్నారు. అంటే ఒకే చికిత్స దశ నుంచి ఇప్పుడు వ్యక్తిగతమైన చికిత్స దశకు వైద్యవిజ్ఞానం చేరుకుంది. దీనికోసం రోగియొక్క స్వభావాన్ని బట్టి..పరీక్షలు చేసి అతడికి అవసరమైన చికిత్స ఏమిటో నిర్ధారించి ట్రీట్మెంట్ చేస్తున్నారు.

 

ఈ వ్యాధి సోకినా వారు కానీ వ్యాధి సోకని వారు కానీ వీలైనత వరకు వాయుకాలుష్యం నుంచీ దూరంగా ఉండటం మంచిది..అంతేకాదు..పొగాకు కాల్చే అలావాటు ఉన్న వారుకూడా వ్యాధి తీవ్రతని తెలుసుకుని దూరంగా ఉండటం శ్రేయస్కరం.. ఎక్కువగా ఈ వ్యాధి ఈ రెండు కారణాల వల్లనే వస్తుందని వైద్యులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: