ఆస్తమా దీనినే ఉబ్బసం అని కూడా అంటారు.అనేక రకాల కారణాలు ఈ వ్యాధిసోకడానికి కారణాలు. పర్యావరణ కాలుష్యం..మానసిక ఆందోళన..చల్లని గాలులు ఈ వ్యాధి సోకడానికి కారణాలు. ఈ వ్యాధి వలన శ్వాసించే నాళాలు సంకోచింఛి..ఆ సంకోచం వలన శ్లేష్మం తయారయ్యి శ్వాసకి ఇబ్బంది తెస్తుంది..ఈ ఇబ్బంది తగ్గడానికి మనం అనేకరకాలుగా మందులు వాడుతూ ఎన్నో రకాల ఇన్హేలర్లు వాడుతూ ఉంటాము..వాటి వలన సత్ఫలితాలు ఏమో కానీ చెడు పరిణామాలు ఎక్కువగా ఉంటాయి.

 Image result for asthma ayurvedic treatment

అయితే ఇన్హేలర్ లు రాత్రి సమయంలో వచ్చే గురకలను తగ్గిస్తుందని చాలా మంది అపోహలు పడుతూ ఉంటారు.కానీ మనం ఎప్పుడు ఇంట్లో వాడే వంట సరుకులతోనే ఈ వ్యాధి తగ్గి..ఈ వ్యాధి ద్వారా వచ్చే గురకని కంట్రోల్ చేస్తాయి. ఈ పద్దతులని పూర్వపు రోజులనుంచీ వాడుతున్నా ఇప్పుడు చాల తక్కువ మంది వీటిమీద ద్రుష్టి పెడుతున్నారు. ఆయుర్వేద పద్దతుల ద్వారా ఈ ఆస్తమా గురకని తగ్గించే పద్దతులు మీరు కూడా చూసి ప్రత్నించండి.


మనం శ్వాస పీల్చుకునే గొట్టాలలో అభివృద్ధి చెందుతూ ఎంతో ఇబ్బందులకి గురిచేసే మ్యూకస్ ని చాలా తేలికగా నివారించగల శక్తి ఆవాల నూనెకి మాత్రమే ఉంది..అంతేకాదు కొన్ని చుక్కల ఆవాల నూనెను వేడి చేసి, ఒక జార్ లో బందించి వచ్చే ఆవిరులను పీల్చండి..దీని ప్రభావం ఆస్తమాపై తప్పకుండ చూపిస్తుంది. ముఖ్యంగా గురకకి కారణం అయ్యే మ్యూకస్ ని కంట్రోల్ చేస్తే గురక దాని అంతట అదే తగ్గిపోతుంది.దీనికోసం ప్రతీ రోజు  నిమ్మరసం  తాగటం వలన మ్యూకస్ ఉత్పత్తి నియంత్రించబడి గురకలను తగ్గిస్తుంది. ఒక గ్లాసు నిమ్మరసంలో చీకర పట్టకుండా త్రాగి చుడండి దగ్గు ,జలుబుల నివారణకి చాల బాగా ఉపయోగపడుతుంది.

సంబంధిత చిత్రం

తేనే ఇది సహజరోగ నివారిణి అంటూ ఉంటారు అందరు..దగ్గుని నివారించడంలో దీని పాత్ర కీలకం..ఎందుకంటే తేనే మనిషికి రోగ నిరోధక శక్తిగా కూడా పనిచేస్తుంది.ఇన్ఫెక్షన్లకి కారణమయ్యే బ్యాక్టీరియాని నాశనం చేయడంలో తేనే చాలా కీలకంగా అవుతుంది.ఇలా  కొన్ని ఆయుర్వేద నియమాల ప్రకారం పాటిస్తే ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే జబ్బులని నయం చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: