మనిషికి శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నా సరే ముందుగానే మనల్ని అలెర్ట్ చేస్తుంది..ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కంటే కూడా ఎంతో ఫాస్ట్ గా పని చేస్తుంది శరీరం...అయితే మగవారిలో క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బు శరీరాన్ని కబళించే ముందు మనకి శరీరం కొన్ని సంజ్ఞలు చేస్తుంది .అవేమిటో ఇప్పుడు చూద్దాం

 

సాదారణంగా మగవారు ఆరోగ్యం విషయంలో ఎంతో అశ్రద్ధ కనబరుస్తారు..ఎక్కువగా వైద్య పరీక్షలు చేయించడం లో దూరంగా ఉంటారు...ఈ క్యాన్సర్ జబ్బు కొన్ని కొన్ని సంకేతాల ద్వారా బయటపడుతుంది అలాంటప్పుడు మీరు తప్పకుండ వైద్యుడిని సంప్రదించాల్సిందే.ఒకే వేళ అలా చేస్తే మొదట్లోనే వ్యాధిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.అయితే పురుషులలో క్యాన్సర్ సోకితే ఎటువంటి మార్పులు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

 

 

మనం రొమ్ము క్యాన్సర్ అనగానే స్త్రీలలో ఉంటుంది అని అనుకుంటాం కానీ చాలా మంది పురుషులకి కూడా వచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు వైద్య నిపుణులు..అయితే మగవారిలో ఈ క్యాన్సర్ ఉన్నట్లయితే రొమ్ము ప్రాంతంలో చర్మం కలర్ మారుతుంది. చనుమొనల నుండీ ద్రవాలు వస్తు ఉంటాయి. లేకపోతే ఎర్రగా మారడం జరుగుతుంది.

 

అలాగే లింఫ్ నోడ్స్ లో మార్పులు గమనించిన వెంటనే..మీలో సమస్యలు పెరగడం గమనిస్తారు బహుమూలాలలో ముద్దగా చర్మం ఏర్పడటం వావు రావడం లేదా మెడను ఎడమ వైపుకు త్రిప్పడానికి వీలు లేకుండా ఉంటుంది.  

 

కొంతమందికి అకారణంగా జ్వరం వస్తు పోతూ ఉంటుంది..ఇలా జ్వరం రావడానికి కారణం క్యాన్సర్ వ్యాధికి సూచికగా పరిగణించవచ్చు..అయితే కొంతండికి అప్పుడు డప్పుడు జ్వరం వస్తూనే ఉంటుంది కానీ దీర్గకాలికంగా జ్వరం వస్తు ఉంటే మాత్రం మీరు వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించు కోవాల్సిందే.

 

క్యాన్సర్ ఉన్న వారిలో కొంతమంది ఏదన్నా తిన్నా లేక ద్రావణాలని త్రాగినా సరే మింగటానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ ఇబ్బందులు రోజుల పాటు ఉంటే మాత్రం అది జీర్ణాశయం కేన్సర్ కావచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: