యాలకులు పేరు చెప్తేనే వాటి సువాసన మనకి గుర్తుకు వస్తుంది..చాలా మంది ఎక్కువగా యలకులతో “టీ” పెట్టుకుని తాగుతారు..శరీరంలో ఉండే అనవసర వ్యర్ధాలని తొలగించడంలో ఇవి ఎంతో ఉపయోగపడుతాయి.నోటి దుర్వాసన పోగోట్టడంలో.. ముఖ్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి కాబట్టే మనం ఇంట్లో చేసుకునే వంటకాలలో వీటిని ఉపయోగిస్తూ ఉంటాం.

Image result for cardamom drink benefits

యాలకులకు ఆయుర్వేద ఔషధగుణాలున్నాయి...ఇవి అనేక శారీరక వ్యాదులకి పరిష్కారాన్ని ఇస్తాయి.యాలకుల వల్ల ఎన్ని ఆరోగ్య సంరక్షణ ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం...మనం తిన్న ఆహారాన్ని వెంటనే జీర్ణం చేసే గుణాలు యాలకుల్లో ఉంటాయి.జీర్ణ శక్తిని మెరుగు పరుచడంలో ఇవి ఎంతో బాగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలని తగ్గించే ఎన్నో లక్షణాలు వీటిలో ఉన్నాయి...గుండె ఆరోగ్యానికి కావాల్సిన పొటాషియం,క్యాల్షియం,మెగ్నిషీయం వంటి పోషకాలు యలకుల్లో ఉన్నాయి. వీటిలో ఉండే పొటాషియం గుండె యొక్క పని తీరుపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు అధిక రక్త పోటుని కంట్రోల్ చేయగల సామర్ధ్యం దీనిలో ఉంది.

 

యాలకులు చాలా మంది అప్పుడప్పుడు తింటూ ఉంటారు దానికి కారణం నోటి దుర్వాసన పోవడానికి..అయితే అలాంటి వారికి తెలియకుండానే డిప్రెషన్ స్థాయి కుడా తగ్గిపోతుంది..చాలా మంది డిప్రెషన్లో ఉండే వాళ్ళకి యాలకులు ఎంతగానో ఉపయోగపడుతాయి.ఒత్తిడిని తగ్గించే శక్తి యాలకులకి మెండుగా ఉంది. చాలా మందికి “టీ” తాగే అలవాటు ఉంటే మాత్రం యలకులని దంచి టీ లో మరగపెట్టుకుని త్రాగితే చాలు.

Image result for cardamom tea benefits


మధుమేహాన్ని అదుపులో ఉంచగల శక్తి యాలకులకి ఉంది..యలకుల్లో మాంగనీసు ఎక్కువగా ఉంటుంది ఈ మాంగనీసు మధుమేహం రాకుండా అడ్డుకుంటుంది.. అంతేకాదు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది కావున మధుమేహం కానీ గుండె సంభందిత రోగాలు కానీ రాకుండా చేస్తుంది.

Image result for cardamom ayurveda benefits


మరింత సమాచారం తెలుసుకోండి: