సోయాబీన్స్ వీటి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు..వీటి వాడకం కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి..కానీ ఈ మధ్య కాలంలో వీటి ప్రాముఖ్యత తెలియడంతో వీటికి ఆదరణం బాగా పెరిగింది. సోయాని సంపూర్ణ ఆహారంగా నిపుణులు గుర్తించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్నవారికి ఈ సోయా ఎంతో ఉపయోగపడుతుంది. సోయాలో ఉండే పోషక విలువలు శరీరానికి ఎంతో మేలుని చేకూర్చుతాయి. ఆవు పాలలో కంటే కూడా ఎక్కువ ప్రోటీన్స్ ఈ సోయాలో ఉంటాయి..అంతేకాదు అధిక కొవ్వుని కలిగి లేని ఒకేఒక్క పాలు ఈ సోయా పాలు.

 Image result for soya benefits

సోయా పాలలో ఉన్న ప్రత్యేకమైన గుణం ఏమిటి అంటే మాంసంతో సమానంగా ప్రో టీన్లు ఉంటాయి.దీనిని శాఖాహారులు ఉపయోగించడం ఎన్నో రకాల పోటీన్స్ అందుతాయి..ప్రస్తుతం సోయా పిండి, సోయాపాలు, కాటేజ్‌చీస్‌ లాంటి సోయా ఉత్పత్తులు మర్కెట్స్ లో  అందుబాటులో ఉన్నాయి.

 

జంతువుల మాంసం నుంచి లభించే ప్రోటీన్లలో కొవ్వు శాతం చాలా అధికంగా ఉంటుంది. కానీ సోయా నుంచి లభించే ప్రోటీన్లలో తక్కువస్థాయిలో కొవ్వు ఉండడం వల్ల రక్త నాళాలకు..తద్వారా గుండెకు ఎంతో మేలుచేస్తుంది. గుండెకి ఆరోగ్య కరమైన ప్రోటీన్స్  చేకూర్చే పదార్థాలతో ‘యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ అడ్మినిస్ర్టేషన్‌’ విడుదల చేసిన జాబితాలో సోయా ఉండడం చుస్తే సోయా ఎంత ఆరోగ్యకరమైన పదార్ధమో తెలుస్తోంది. 

 Image result for soya bean products

సోయాలో ఉండే మరొక విశిష్టమైన గుణం ఏమిటి అంటే...శరీరంలో పెద్దపేగు ఆరోగ్య సంరక్షణకి దోహదపడతాయి..అంతేకాదు పెదపేగుకు వచ్చే క్యాన్సర్ ని నివారించడం లో సోయా ఉత్పత్తులు చాలా కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రీయంగా రుజువైంది. జీర్ణవ్యవస్థని మెరుగు పరిచి అన్నవాహిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయి.కాల్షియం పెరగడానికి దోహదపడి ఎముకులని చాలా ధృడంగా చేస్తుంది.

 

 

ఆరోగ్యకరమైన సోయాలో ఎక్కువగా ఫైబర్ ఉండటం వాళ్ళ సోయాని రెగ్యులర్ గా వాడె వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి మధుమేహం ని అదుపులో ఉంచుతుంది.అలాగే మూత్రపిండాల పని తీరుని కూడా మెరుగు పరుస్తుంది.కిడ్లీలో రాళ్ళ సమస్యలు కూడా ఉత్పన్నం కావు..ఎన్నో ప్రయోజనాలు ఉన్న సోయాని ప్రతీ రోజు వాడటం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావు.

 Related image

 


మరింత సమాచారం తెలుసుకోండి: