వయసు మీదపడే కొద్దీ.సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల వయసుతో పాటు సమానంగా పొట్ట కూడా పెరుగుతూ వస్తుంది.అసలు పొట్ట ఎందుకు వస్తుంది అంటే ఒక్కటే సమాధానం మారుతున్న తిండి ప్రభావం..జీర్ణ క్రియ సరిగా జరగక పోవడం. ఎప్పుడైతే జీర్ణక్రియ సాఫీగా సాగుతుందో అప్పుడు శరీరంలో కొవ్వు నిలవలు కొట్టుకుని పోతాయి.మీ ఆరోగ్యం సరిగా లేదంటే దానికి కారణం ముఖ్యంగా పొట్ట వలన కలుగుతుంది. శరీరంలో అనేక భాగాలలో కొవ్వు పేరుకు పోయి ఉంటుంది..అయితే ఈ పొట్ట భాగంలో  కొవ్వు పేరుకు పోవడం అత్యంత ప్రమాదకరం, వీటివల్ల మధుమేహం, గుండె జబ్బులు,క్యాన్సర్ వంటి రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 

అయితే కొన్ని రకాల వ్యాయామాలు, ఆహారపు అలవాట్ల ద్వారా పొట్టని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు..వీటిలో ముఖ్యమైనవి బ్రీతింగ్ ఎక్సర్సైజులు వీటి ద్వారా పొట్టను తగ్గించవచ్చు..ఈ వ్యాయామం కోసం ముందుగా నిటారుగా కూర్చోవడం కానీ..వెల్లకిలా పడుకోవడంగానీ చేయాలి. తరువాత శ్వాస మీద ధ్యాసపెట్టాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోవడం..శ్వాస ఎలా తీసుకున్నామో అదే మాదిరిగా వదలడం చేయాలి. ఇలా ప్రతీరోజూ చేయడం వలన పొట్ట తగ్గుతుంది. ఈ వ్యాయామంలో పొట్ట బయటకి రావడం లోపాలకి వెళ్ళడం గమనించవచ్చు.

 

ఆహారపు అలవాట్లు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి..కొవ్వు పట్టే తిండి పదార్ధాలు ఏవీ కూడా మీ దరి చేరనివ్వకండి..పాలు,వెన్న...గెడ్డ పెరుగు, పన్నీరు..ఐస్ క్రీమ్స్ ఇలా వీటిని దూరంగా ఉంచి..పిండి పదార్ధాలని,పీచు పదార్ధాలని ఎక్కువగా మీ ఫుడ్ మెనూలో ఉంచండి..ఎక్కువగా గ్రీన్ టీ త్రాగడానికి ప్రయత్నం చేయండి..ఎందుకంటే గ్రీన్ “టీ” చెడు కొలిస్ట్రాలని చేదించడంలో బాగా పని చేస్తుంది..కనీసం రోజుకి 4 నుంచీ 5 సార్లైనా సరే త్రాగడం మంచిది.

 

అంతేకాదు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్..వాడటం వలన పొట్టలో ఉన్న కొవ్వును.. వేగంగా కరిగించవచ్చు..మనకి దొరికే డ్రై ఫ్రూట్స్ లో కొవ్వుని కరిగించడానికి ఎక్కువగా ఉపయోగపడేది “వాల్ నట్స్” వీటినే అక్రోట్స్ అని కూడా అంటారు వీటిని రోజుకి నాలుగు చప్పున తీసుకుంటే శరీరంలో అధికంగా ఉండే చెడు కొలిస్త్రాల్ ని కరిగించేస్తుంది.అంతేకాదు గుండెకి  కొవ్వు వాళ్ళ కలిగే హాని నుంచీ కాపాడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: