అందమైన చిరునవ్వు ఎదుటి వారికీ మీ మీద మంచి అభిప్రాయాన్ని కలిగించటమే కాదు,  మీ మీద గౌరవాన్ని కూడా రెట్టింపు  చేస్తుంది. మరి అందమైన చిరునవ్వును సొంతం చేసుకోవాలంటే ముందు మీ పళ్ళు తెల్లగా, అందంగా మెరిసిపోవాలి.  మరి అందంగా మెరిసే పళ్ళ కోసం కొన్ని చిట్కాలు.

1. వంటసోడా, హైడ్రోజెన్ పేరాక్సేడ్ ను కొద్ది కొద్దిగా తీసుకుని ఈ మిశ్రంమాన్ని బ్రష్ తో పళ్ళ మీద సున్నితంగా రుద్దాలి. హైడ్రోజెన్ పేరాక్సేడ్ పళ్ళను త్వరగా తెల్లగా చేస్తుంది. అయితే ఎక్కువ  మొత్తంలో హైడ్రోజెన్ పేరాక్సేడ్ ను ఉపయోగించరాదు. దీనిని ఉపయోగించిన వెంటనే గోరువెచ్చని నీటితో శుభ్రం  చేసుకోవాలి.

2. పళ్ళ మీద పసుపు పచ్చని మరకలు పోగొట్టుకోవాలంటే నిమ్మ తొక్క చాలా బాగా పనిచేస్తుంది . నిమ్మ తొక్కను పంటి మీద సున్నితంగా అప్లయ్ చేయాలి. 

3. నిమ్మరసాన్ని బ్రష్ తో అప్లయ్  చేసిన మంచి ఫలితాన్ని పొందవచ్చు. నిమ్మరసం లో కొద్దిగా రాళ్ల  ఉప్పు కలిపిన తర్వాత అప్లయ్ చేస్తే పంటి మీద పసుపు మరకలను త్వరితగతిన పోగొట్టవచ్చు. 

4. చిటెకెడు వంటసోడా, చిటేకడు ఉప్పు కలిపి బ్రష్ తో పళ్ళు తోముకొంటే తెల్లగా మెరిసిపోతాయి. 

5. స్ట్రాబెరి పళ్ళ గుజ్జు ను బ్రష్ సహాయంతో పళ్ళ మీద సున్నితంగా రబ్ చేయాలి. రోజుకి రెండు మూడు నిమిషాల పాటు చేయాలి. ఈ విదంగా కొన్ని వారాల పాటు చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు. దీనిలోని సహజసిద్దమైన ఏంజైమ్ లు పంటిని మరింత ప్రకాశ వంతంగా మెరిసే టట్లు చేస్తాయి. చిన్న పిల్లల సైతం దీన్ని ఎంతో  ఇష్టంగా చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: