ఈ మధ్య నోరు తరుచుగా ఎండి పోతుంటే జాగ్రత్తలు తీసుకోవాలి. నోటిలో లాలాజలం ఊరకపోతే బాక్టీరియా ఎక్కువగా ఫామ్ అవుతుంది. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎక్కువ రోజుల పాటు కొనసాగితే, నోట్లోని మృదు కణజాలం దెబ్బతింటుంది. చిగుళ్ల సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని నివారణ కోసం చక్కెర లేని బబుల్ గమ్స్, మింట్ వంటివి వాడాలి. అవి నోటిలో లాలాజలం ఊరడానికి సహాయపడతాయి. కొద్ది కొద్దిగా నీటిని ఎక్కువ సార్లు తాగడం, ఐస్ ను చప్పరించడం చేయాలి. కాఫీ, కూల్ డ్రింకులు తగ్గించాలి. పొగాకు, ఆల్కాహాల్ జోలికి వెళ్లకూడదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: