మస్కిటో కాయిల్స్ , రీఫిల్స్ వల్ల కొందరికి అలర్జీ వస్తుంది. అలాంటప్పుడు గ్లాసులో సగానికి నీళ్ళు పోసి అందులో ఐదారు కర్పూరం బిళ్ళలు వేసి ఉంచితే, ఆ వాసనకు దోమలు బయటకి పోతాయి. మూత్రవిసర్జన సమయంలో మంటతో బాధపడుతున్న వారు పుచ్చకాయరసంలో కాస్తంత మజ్జిగ కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.  నిమ్మకాయ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీనికి కాస్త ఉప్పు కలిపి రోజుకు రెండుసార్లు పళ్లు తోముకుంటే, గార పోయి పళ్లు తళతళలాడతాయి. ఫ్రిజ్ కనుక దుర్వాసన వస్తుంటే, ప్లేటులో కొన్ని బొగ్గులు వేసి కాసేపు లోపల ఉంచితే వాసన పోతుంది. కాకర ఆకుల్ని ఎండబెట్టి నేతిలో వేయించి పొడి చేసుకోవాలి. దీనికి కాస్త ఉప్పు చేర్చి రోజూ అన్నంలో కలుపుకుని ఓముద్ద తింటే చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. పెరుగులో పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని పొట్ట మీద క్రమం తప్పకుండా, రాసుకుంటే గర్భం ధరించినపుడు పొట్ట మీద ఏర్పడ్డ చారలు తగ్గి పోతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: