ఈ రోజుల్లో మనిషికి ఎప్పుుడు ఏదో ఒక పని వత్తిడి వల్ల సరిగా నిద్ర పట్టదు. దీంతో అనేక అనారోగ్యకరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా నిద్ర లేమి వల్ల గ్యాస్ ట్రబుల్, కళ్లమంట,తలనొప్పి, లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. మరి సుఖంగా నిద్ర పోవాలంటే ఏం చేయాలి.  

ప్రతిరోజు రాత్రి పూట నిద్రించేటప్పుడు తప్పని సరిగా భోజనం చేయాలి.అన్నం తినకుండా ఆకలితో నిద్రకు ఉపక్రమించకండి. అలా అని పడుకునే ముందు బాగా తినాలని కాదు. తేలికగా ఉండి నిద్రకు దోహదం చేసే అమినో అసిడ్ ట్రైప్టోఫాన్ గల ఆహారం తీసుకోవాలి. నిద్రించేందుకు ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. దానివల్ల మీ శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గి అలసిపోయినట్లు అవుతారు. రోజంతా క్రియాశీలకంగా గడపండి. అప్పుడు రాత్రి వేళ విశ్రాంతి నిద్రించగలుగుతారు. 


సుఖమైన నిద్ర ఒంటికి మంచిది.


కొంత మంది రోజు కాస్త మద్యం సేవిస్తే సుఖంగా నిద్రపడుతుంది అనే అపోహ ఉంటుంది. కాస్త మత్తు ఉన్నంత సేపు నిద్ర పట్టవచ్చు మరి మత్తు దిగితే చుక్కులు కనబడుతుంది. పడుకోబోయే ముందు మద్యపానం చేయడం వల్ల ఆరోగ్యనికి హనికరం. మద్యపానం చేయడం వల్ల బాగా నిద్రపడుతుందని అనుకోవడం భ్రమ మాత్రమే అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మద్యం పుచ్చుకోవడం వలన నిద్ర తొందరగా పట్టినా, ఏ అర్థరాత్రి వేళో మెళకువ వచ్చేస్తుంది. కనుక నిద్రకు ముందు మద్యం తీసుకోకపోవడమే మంచిది. కాల్పనిక సాహిత్యమేదైనా చదవండి. మీరు పూర్తిగా పుస్తకపఠనంలో లీనమైపోగలగితే ఒక సరికొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోగలుగుతారు. అలా వెళ్ళిపోయి గాఢనిద్రలోకి జారిపోతారని వైద్యుల పరిశోధనలో వెల్లడైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: