జలుబు లేదా పడిసం పై శ్వాసనాళ వ్యవస్థ(ముక్కు,గొంతు,స్వరపేటిక) పై వైరస్ దాడి చేయడం వల్ల కలిగే జబ్బు.సాధారణంగా జ్వరముతో కలిగే ముక్కు కారడాన్ని జలబు అని పిలుస్తారు.సర్వసాధారణంగా మామూలు జలుబు లేదా పడిసం రైనో వైరస్ అనే వైరస్ క్రిమి వల్ల , లేదా కొరోనా అనే వైరస్ ల వల్ల కలుగుతుంది. వాతావరణంలో ఉండే ఈ వైరస్ లుదేహంలోకి ప్రవేశించినపుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్ళు, చేతి రుమాలు వంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది. కళ్ళు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం, శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటం(ముక్కు దిబ్బడ) దీని ముఖ్యమైన లక్షణాలు.  


వర్షాకాలం వస్తే చాలు అప్పటివరకూ ఎక్కడ వుంటుందో తెలియదు కాని ఒక్కసారిగా వచ్చి పట్టేస్తుంది జలుబు. పిల్లలు స్కూలుకు వెళ్లెవరకూ బాగానె వుంటారు కాని తిరిగి ఇంటికి వచ్చేటప్పటికీ నీరసంగా వస్తారు. జలుబు అంటుకోగానే ఒకటే ఒళ్లు నొప్పులు, గొంతు, తలనొప్పి, జలుబు, జ్వరం... ఈ లక్షణాలన్నీ ఒకేసారి కనిపిస్తాయి. కొందరికి ఒకటే తుమ్ములు, మరికొందరికి దగ్గు కనిపిస్తుంది.  పెద్దవాళ్లయితే ఏదో విధంగా తట్టుకుంటారు కాని పిల్లలు నీరసించిపోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్ సమస్యలకు కొన్ని నివారణ సూచనలు.


జలుబు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఎక్కువ హానికరం కాని పారాసిటమాల్ టాబ్లెట్‌లు వాడవచ్చు. జ్వరం దారికి వచ్చాక వాటి అవసరం కూడా ఉండదు.

జలుబు పూర్తిగా దారికి వచ్చే వరకు రోజుకు మూడుసార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిలించడం మరచిపోవద్దు.

రోజుకు రెండు సార్లు విక్స్ లేదా పసుపు వేసుకొని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు గొప్ప రిలీఫ్ వస్తుంది.

ఈ సీజన్‌లో నీళ్ల నుంచి అనేక జబ్బులు వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ దాకా కాచి, వడపోసిన నీళ్లు మాత్రమే తాగాలి.

ఃజలుబు, జ్వరం తగ్గేవరకు పండ్లు, పండ్ల రసాలకు దూరంగా ఉండండి.

నిమ్మపండు ఈ సీజన్‌లో వచ్చే జలుబు లక్షణాలను త్వరగా తగ్గిస్తుంది. వేడి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జబ్బు నుంచి త్వరగా ఉపసమనం పొందుతారు.

మిరియాలు, వెల్లుల్లి, అల్లం.. ఇవన్నీ కూడా ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి.

మన ఇంట్లో దొరికే వస్తువులతో మొదట జలుబు, దగ్గు నివారణ పొందె ప్రయత్నం చేసుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: