కమ్యూనికేషన్ రంగంలో ఇప్పటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి..వస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్ రంగంలో రోజు రోజుకీ ఎన్నో కొత్త కొత్త ఫీచర్స్ తో వినియోగదారులు ఆశ్చర్యపోయే సౌకర్యాలు వస్తున్నాయి.

ఇక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే లెక్క.  తాజాగా ఆక్వా సెల్ఫీ' పేరిట ఇంటెక్స్ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.6,649 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. 

ఇంటెక్స్ ఆక్వా సెల్ఫీ ఫీచర్లు :

5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


మరింత సమాచారం తెలుసుకోండి: