నీచగుణములెల్ల నిర్మూలమైపోవు  కొదువ లేదు సుజన గోష్ఠి వలన గంధమలమేమి కంపడగినయట్లు విశ్వదాభిరామ వినురవేమ! భావము : సజ్జనులతో సాంగత్యము వలన, వారితో సంభాషిచడము వలన మనలోని దుర్గుణుములను తొలగిపోతాయి మంచి వారితో కలిసి మెలిసి తిరగడము వంటికి గంధము పూసుకోవడము వంటిది. శరీరములోని దుర్గంధాన్ని మంచి గంధము పూత యెలా దూరము చేస్తుందో, అలాగే సజ్జన సాంగత్యము మనలోని అవలక్షణాలని దూరము చేస్తుందని ఈ పద్యబావము.  

మరింత సమాచారం తెలుసుకోండి: