గృహంలో భగవంతుని పూజించేందుకు ఓ ప్రదేశం ఉండాలని భారతీయ వాస్తు శాస్త్రం నిర్దేశిస్తుంది. అయితే ఈ గది ప్రత్యేకంగా ఉండాలా లేదంటే ఒక అలమరాలో పెట్టుకుంటే సరిపోతుందా అన్న విషయం వారి వారి అభిప్రాయలను బట్టి మారుతుంటుంది. అలాగే గృహ వైశాల్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇల్లు పెద్దదిగా ఉన్నప్పుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు.  అందువల్ల పూజగదిలో చిన్నచిన్న విగ్రహాలను పెట్టి పూజచేసుకోవటం ఎంతో ఉత్తమం. అదేవిధంగా పూజ చేసే విగ్రహాలు ఏవైనప్పటికీ వారానికోసారిగానీ, పండుగల సమయాలలోనూ, గ్రహణాల తర్వాత వారివారి సంప్రదాయాన్ని బట్టి శుభ్రం చేయాలి. నిత్యం ప్రతిరోజూ శుభ్రం చేయాలనుకునేవారు చేసుకోవచ్చు.  

సాదారణంగా మద్య తరగతి కుంటుంబీకులు ఉన్నంతలో పూజ గది నిర్మాణం చేయాలనుకుంటారు. ఇంట్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పుజగదిలో సానుకూల శక్తులుండే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. పూజగదిలో దేవతల విగ్రహాహాలతో మరియు సువాసభరిమతైన పువ్వులతో, ఆయిల్ ల్యాంప్స్ తో, మరియు గంటలతో అలంకరించబడి ఉంటుంది. పూజగదిలో ఎలాంటి శబ్దాలు లేకుండా చాలా నిశ్శబ్దవాతావరనంలో పూజలు చేయడం, చేతులు జోడించి ప్రార్థలను చేయడం, మంత్రాలు వల్లించడం, ప్రార్థనా శ్లోకాలను చెప్పండం జరుగుతుంది.  గతంలో ఇంటికి అందమైన రూమ్ లింగ్ రూమ్ గా ఎంపిక చేసుకొని, వారి అభిరుచులకు తగినట్లుగా కట్టించుకొనేవారు. ట్రెండ్ మారే కొంది ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో ఇంటి నిర్మాణంలో కూడా వారి అభిరుచికి తగినట్లుగా గదులను మోడ్రన్ గా తీర్చిదిద్దుకుంటున్నారు.

లివింగ్ రూమ్, బెడ్ రూమ్ మరియు కిచ్ ను చాలా మోడ్రన్ గా ఇటాలియన్ స్టైల్ లో మోడ్రన్ గా నిర్మించుకొనే ఈ రోజుల్లో పూజగదికి కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఇలా ఎవరికి తగిన రీతిలో వారు పూజగది నిర్మాణంను కట్టించుకోవడానికి ఇష్టపడుతుంటారు. చిన్న ఇల్లలో ఒక విధంగా పెద్దఇల్లలో ఒక విధంగా విశాలంటా వివిధ రకాల డిజైన్లతో రూపొందించుకుంటుంటారు. మీరు కూడా అలా పూజగదిని నిర్మించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని కోరుకుంటున్నట్లైతే మీకు తగిన బడ్జెట్లోనే పూజగతి నిర్మించుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: