యువత - టీనేజర్ ల శక్తి తిరుగులేనిది. వారి ఆసక్తులకి సరైన పదును పెడితే సంచలనాలు సృష్టించగల దృక్పదం వారి సొంతం. వారి దృష్టి ఏయే వాటి మీద ఉందీ ఎలాంటి వాటి మీద వారి మక్కువ ఎక్కువగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడం ఎప్పుడూ జరిగే విషయమే. ఈ మధ్య ఐర్లాండ్ దేశం లో టీనేజర్ ల ఫోకస్ - మనసూ దేనిమీద ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఒక సంస్థ చేసిన సర్వే లో ఆశ్చర్యకర విషయాలు బయటపడడం తో షాక్ అవడం సర్వే చేసినవారి వంతు అయ్యింది.

 

 

 

చాలా మంది టీనేజీ అమ్మాయిలూ , అబ్బాయిల మీద చాన్నాళ్ళు చేసిన ఈ సర్వే లో విషయాల బట్టీ అంచనా వేసుకుంటే వారంతా ' సెక్స్ ' మీద విపరీతమైన మోజుతో ఉన్నారట. ఈ విషయాన్ని సర్వే తెలపగానే అక్కడి పెద్దలు షాక్ తిన్నారు. సెక్స్ తరవాతి స్థానాల్లో తాగుడూ , సిగిరెట్ ఉన్నాయి తప్ప ఎదో చెయ్యాలనీ, ఏదో సాధించాలనీ కోరుకునేవారు చాలా అరుదుగా ఉన్నారు. 18 ఏళ్ళ వయసు ఉన్న పిల్లల మీద సాగిన ఈ సర్వే లో వారి ఆహారం దగ్గర నుంచీ ఉదయం లేవడం తో మొదలు పడుకునే దాకా వారిని ఆకర్షించే విషయాల మీద సర్వే జరియింది.

 

 

 

అన్నిటికంటే ముక్కున వేలేసుకునే విషయం ఏంటంటే ఈ సర్వే లో పాల్గొన్నవారు అందరిలో దాదాపు తొంభై ఐదు శాతం మందికి ఇప్పటికే సెక్స్ అనుభవం ఉన్నట్టు చెప్పారు.సంపన్న వర్గాల పిల్లలతో పోలిస్తే.. పేద.. మధ్యతరగతి విద్యార్థులలో సెక్స్ మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సెక్స్ అంటే ఎదో రోమాన్స్ వరకూ కాకుండా కండోమ్ వాడడం, గర్భం రాకుండా వేసుకునే పిల్స్ .. ఇలా అన్ని విషయాల్లో వారు నిష్ణాతులు గా ఉన్నారు. సెక్స్ మీద ఉన్న ఆసక్తి తోనే శరీరాలని చాలా అందంగా తయారు చేసుకుంటూ డైటింగ్ లు చెయ్యడం, నాన్ వెజ్ ని పక్కన పెట్టడం లాంటివి కూడా చేస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: