మన పూర్వీకులు ఏర్పరిచిన సాంప్రదాయాల వెనుక ఎన్నో అర్ధాలు ఆరోగ్య సూత్రాలు మిళితమై ఉంటాయి. ఆ విషయాలన్నింటికి మనం ఆశ్చర్యపోయే సైంటిఫిక్ రీజన్స్ కలగలసి ఉంటాయి. అందులో ముఖ్యమైంది రాగి పాత్రలో నీళ్ళు త్రాగడం. ఈ అలవాటు వల్ల పొందే ఆరోగ్య సూత్రాలు తెలిస్తే మన పూర్వీకులు ఎంత ముందు చూపుతో ఉండేవారో అర్ధం అవుతుంది. రాగి పాత్రలలో నీళ్లు తాగితే మంచిదని ఆయుర్వేదం కూడ చెబుతోంది. పురాతన ఈజిఫ్టియన్లు నీళ్లను రాగిపాత్రలలో నీళ్ళను తాగేవారని చరిత్ర చెపుతుంది. ఇప్పటికీ అమెరికాలోని గ్రామాలలో నివసించే అమెరికన్స్ ఈ రాగి పాత్రలోని నీటిని తాగుతున్నారు అంటే దీని ప్రాధాన్యత ఎంత ఉందో అర్ధం అవుతుంది. 

సైన్స్ ప్రకారం రాగి పాత్రలు ఫుడ్ పాయిజినింగ్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయని తెలుస్తోంది. రాత్రంతా రాగి పాత్రలో నీళ్లు ఉంచి ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి కావల్సిన కాపర్ అందుతుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన రెండు లీటర్ల నీటి ద్వారా 40 శాతం కాపర్ పొందగలుగుతాం. రాగిపాత్రలోని నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాలతో కిడ్నీల్లో ఉండే మలినాలు తొలగిపోయి జీర్ణాశయాంతర నాళాన్ని శుభ్రం చేస్తాయి. అదేవిధంగా జీర్ణ ప్రక్రియ ఆరోగ్యంగా ఉండటానికి, ఒబేసిటీని తగ్గించి ఫ్యాట్ ని కరిగించడానికి ఈ రాగి పాత్ర నీరు  సహకరిస్తుంది. రాగిపాత్రలోని నీరు శరీరానికి అందడం వల్ల కాలేయం, గుండె, కిడ్నీ, కండరాల ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. 

అంతేకాకుండా వాతం, కఫం, పిత్తం వంటి దోషాలు ఈరాగి పాత్ర నీటి వల్ల తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈపాత్రలోని నీరు యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, సెల్ ఫార్మేషన్ గుణాలు, ఫ్రీ రాడికల్స్ తో పోరాడే గుణం రాగిలో ఉంటుంది. కాబట్టి రాగి పాత్రలు వాడితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.  మన శరీరానికి సంబంధించిన ఇతర నొప్పులను నివారించడానికి ఈ పాత్రలోని నీరు యాంటీ ఇన్ల్ఫమేటరీగా పనిచేస్తుంది. ఎముకల బలానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి కాపర్ సహకరిస్తుంది. 

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన శరీరంలోని థైరాయిడ్ గ్రంథులు క్రమబద్ధంగా పనిచేయడానికి కాపర్ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి రాగి పాత్రలో నీరు ఎంతో మేలు చేస్తుంది. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడానికి కాపర్ బాగా ఉపయోగపడుతుంది. దానితో పాటు హిమోగ్లోబిన్ పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న రాగి పాత్రలోని నీరు త్రాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలుసుకోగలిగితే మనకు మనమే ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్ళం అవుతాము..



మరింత సమాచారం తెలుసుకోండి: