మనం రోజు తినే ఆహార పదార్ధాలలో జీలకర్ర వంట చేయడం పూర్తి కాదు. ఎంతో రుచిగా వుండే ఈ జీలకర్ర లేకుండా మనదేశంలో సాధారణంగా ఏ వంటకం వుండదు. ఎలాంటి సామాన్యమైన వంటకం అయినా సరే జీలకర్ర పడితేచాలు అసాధారణ వంటకం అయిపోతుంది. రుచి మాత్రమే కాక తినేవారికి ఆరోగ్యాన్ని కూడా కలిగించే ఈ జీలకర్రను ప్రతివారూ తప్పక ఆహారంలో చేరుస్తారు. అయితే జీల‌క‌ర్ర రుచిలోనే కాదు ఆరోగ్యానికి మేలు చేయ‌డంలోనూ రారాజుగా ఎలా మారిందో తెలుసుకుంటే అనేక ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. 

జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, సి లు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాదు జీలకర్రలో డయాబెటిస్, ట్యూమర్స్ మరియు మైక్రోబయల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్లనే మన పూర్వీకులు ప్రాచీన కాలం నుండి జీలకర్రను నీటిలో మిక్స్ చేసి ప్రతి రోజూ త్రాగేవారు. ఇలా చేయడం వల్ల మన శరీరానికి సమకూరే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. 

జీరా వాటర్ మొత్తం బాడీ సిస్టమ్ ను హైడ్రేషన్లో ఉంచుతుంది అని ఆయుర్వేద డాక్టర్స్ అంటారు. ఈ జీలకర్ర వాటర్ కు వ్యాధినిరోధక శక్తి ఉండటం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. జీరా వాటర్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటుంది అని అంటారు. మన శరీరంలోని రక్తంలో హీమోగ్లోబిన్ తయారవటానికి కావలసిన ముఖ్యమైన పోషకకారకాలు జీల‌క‌ర్ర‌లో ఉన్నాయి. 

ఈ జీలకర్రను రెగ్యులర్ డైట్ లో రోజు చేర్చుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించుకోవచ్చు. అంతేకాదు జీరా వాటర్ నిద్ర సమస్యలను నివారిస్తుంది మరియు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచడమే కాకుండా మనలో లాలాజల ఉత్పత్తికి సహాయపడుతుంది. జీరావాటర్ వల్ల మన బ్లడ్ ప్రెషర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ జీలకర్ర వాడకం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడమే కాకుండా దంతక్షయం, కళ్ళ సమస్యలు, ప్రేగు సమస్యలు, జాయింట్ సమస్యలు, బ్రీతింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇన్ని రకాల ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి కాబట్టే ఆరోగ్యానికి ‘రారాజు జీలకర్ర’ అని అంటారు..



మరింత సమాచారం తెలుసుకోండి: