మన భారతీయ సంస్కృతిలో గోమాతను ఎంతో పవిత్రంగా ఆరాధిస్తాం. అవును పూజించడం  మన హైందవ ధర్మంలో ఒక భాగం. అటువంటి ఆవు నుండి వచ్చే గోమూత్రం నుండి ఆవుపాలు వరకు లభించే పదార్ధాలలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో ఆవుపాలు, ఆవు నెయ్యి, ఆవుపాల పెరుగుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.

ఆవు నెయ్యి రుచికరంగా ఉండటమే కాకుండా ఈ ఆవు నెయ్యిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నెయ్యిలో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్ ఏజెంట్స్, యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆవు నెయ్యిని ఎక్కువ పరిమాణంలో తీసుకోకూడదు. అలా తీసుకుంటే అనేక అనర్ధాలు వస్తాయి.  

ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. అంతేకాదు డైజెషన్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయి. అయితే తక్కువ పరిమాణంలో తీసుకోవడం మర్చిపోకండి. ఆవు నెయ్యిలో అనేక విటమినులు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, డి, ఇ మరియు కె వంటి విటమిన్స్ లభిస్తాయి. కాబట్టి భోజనంలో కొంత నెయ్యిని జోడిస్తే రోజుకు అవసరమయ్యే విటమిన్లు శరీరానికి అందుతాయి అని చెపుతారు. ఆవు నెయ్యిలో క్యాన్సర్ తో పోరాడే శక్తి ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 

ఆవు నెయ్యిని రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకుంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది. అలాగే కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మరోక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఆవు నెయ్యి  ఉపయోగించేవాళ్లలో తెలివితేటలు బాగా పెరుగుతాయని చెపుతారు. థైరాయిడ్ సమస్యతో బాధ పాడేవాళ్ళు కూడ ఈ ఆవు నెయ్యిని వాడటం వల్ల ఆరోగ్య వంతులుగా మారుతారు అని అధ్యయనాలు చెపుతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఆవు నెయ్యి. వాడటం అలవాటు చేసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: