టీనేజ్,        అడాలసెన్స్- పెద్ద వాళ్ళెవరికైనా తలచినంతనే మనస్సంతా పులకరింత,  తనువంతా జలదరింత "నవయవ్వనం" మధురానుభూతి.   మనసంతా కమ్ముకునే ఫ్రష్నెస్. ఒక థ్రిల్లింగ్.కాని ఆ ఏజ్లో ఉన్నవాళ్లకి మాత్రం  అంతా కంఫ్యూజన్. అయోమయం ఏమీ అర్ధంగాని, అంతా అర్ధమయినట్లనిపించే వయసు తాలూకు మధురిమలు, సరిగమలు.   


అన్నీ అందుబాటులో ఉన్నట్లూ,     మరిలేనట్లూ దోబూచులాడే అనుబూతుల సంతులితం.     టీనేజ్ రొమాన్స్ - దీనిమీద వచ్చిన సినిమాలు కోకొల్లలు. సరిగా ప్రెజెంట్ చేస్తే వసూళ్ళ వర్షం.  ఏమాత్రం తేడా కొట్టినా చేతికి చిప్పే. అదే కంఫ్యూజన్ ఇక్కడా రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళు పిల్లల్లో పిల్లలుకాదూ. పెద్దల్లో పెద్దలూ కాదూ.


అసలు ప్రేమంటే- మనుషుల్లో ఉండే భయం, కోపం, సెక్స్ లాగా  ఇది ఒక ‘ఇన్స్టింగ్టు లేదా స్వభావం కాని భావావేశం కాని కాదు’ .   కొంతమంది సైకాలజిస్టులు దీనిని ఒక వస్తువు, వ్యక్తి, ఒక భావన చుట్టూ అల్లుకున్న మధురానుభూతుల సమాహరం లేదా 'సెంటిమెంట్'  అంటారు.


ఒక వ్యక్తి - ముఖ్యంగా టీనేజ్లో  ఆపోజిట్ సెక్స్  చూట్టు అల్లుకునే ఈ ప్రేమ లాలిత్యంలో-  మర్యాద, మెచ్చుకోలు, గర్వం, భక్తి, స్నేహం, సెక్స్ అణిగిమణిగి ఉంటాయి. నీకు నేనున్నాననే భావన ఒకరి కొకరమనే తత్వం ముప్పిరిగొని ప్రభంజనంలా ఆవహిస్తాయి. ఇందులో సెక్స్ అనేది ప్రేమ అనే సప్త-వర్ణాల్లో ఒక వర్ణం మాత్రమే. ప్రేమకు బింబం కాని, ప్రతి బింబం కానీ కానేకాదు.


వ్యక్తిత్వం రూపుదిద్దుకునేటప్పుడు కాల క్రమేణా ఈ లక్షణాలు సంపూర్ణత సంతరించుకుంటాయి. టీనేజ్లో ఇవన్ని ఒక వర్ణమాలికలా,  దృశ్యమాలిక లా ఒకదాని తరవాత ఒకటి  ఆ పసికాని,   పరిణితి చెందని  వసివాడని  మనసును ఆవహిస్తాయి.  


ఉప్పెనలా ఉవ్వెత్తుకొచ్చిన ఈ లక్షణాల దెబ్బకు ఆ టీనెజ్ మనసు విలవిల్లడి పోతుంది. ఈ లక్షణాల చెడులు అవగతమై క్రమేణా మాయమై - ఈ సైకిల్ అనేక విషయాల్లో జరిగినప్పుడే వ్యక్తిత్వం రూపుదిద్దు కుంటుంది. ఇది మగ పిల్లల్లోనే కాదు ఆడ పిల్లల్లోనూ జరిగే పరిణామమే.

మనిషి "ప్రేమలో పడ్డాడు" అనే భావనల తొలకరి క్రిస్టల్ క్లియర్. దానిలో స్వచ్చత సాత్వికత అమోఘం. దాంట్లో టీనేజర్లలో ప్రేమిస్తున్న వ్యక్తి పట్ల బలమైన శారీరక వాంచ నుంచి భావాతీతమైన ఆత్మత్యాగం వరకు ఉద్వేగాలు పొంగి పొర్లుతాయి. అదీ అసలైన ప్రేమంటే.

టీనేజ్ ప్రేమ అంత బలమైనదే కాదు బలీయమైనది.Image result for teenage love quotes for him from the heart


అలాంటి ప్రేమ టీనేజర్లలోనే సాధ్యం. జీవితములో అన్నీ అనుభవైకవేధ్యమైన వారిలో ఈ ప్రేమ కలికానికి కూడా కనిపించదు. ఒక తృష్ణ తప్ప ప్రేమ కానే కాదు. ఎవరిలోనైనా టీనేజ్ దాటిన తరువాత ఈ ప్రేమ ఉంటే అతనింకా మానసికంగా 'టెనెజ్ దశాలోనే ఉన్నట్లు.


రచనలద్వారా చూస్తే షెల్లీ, కీట్స్, చలం లో ఈ ప్రేమ దశపు చాయలు వృద్ధాప్యంలోను కనిపించాయి. 

 

 

 

 

    

 

  


మరింత సమాచారం తెలుసుకోండి: