ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్‌ తో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచ జనాభాలో 40% మించి పెరిగి పోయింది అంటే ఈ వ్యాధి ఎటువంటి ప్రమాదకర స్థాయికి చేరుకుందో అర్ధం అవుతుంది. అయితే ప్రస్తుతం చాలా మందిని  పీడిస్తున్న టైప్-2 డయాబెటిస్ నుండి ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే ఈ వ్యాధి నుండి బయట పడవచ్చని పరిశోధనలు చెపుతున్నాయి. ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.

దాల్చిన చెక్కతో తయారు చేసిన టీని నిత్యం తీసుకుంటే దీంట్లో ఉండే ఔషధ కారకాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. అంతేకాకుండా  తాజా మామిడి ఆకులను కొన్నింటిని తీసుకుని వాటిని నీళ్లలో మరిగించి ఉదయాన్నే వడకట్టి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది అని పరిశోధనలు చెపుతున్నాయి.   ఒక టేబుల్ స్పూన్ ఉసిరి కాయ జ్యూస్, ఒక కప్పు కాకరకాయ జ్యూస్‌లను కలిపి ప్రతి రోజు రెండు పూటలా  తీసుకుంటే డయాబెటిస్‌ను తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తుంది అని చెపుతున్నారు.  
 
పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయల జ్యూస్‌ను కలిపి తాగితే మధుమేహంతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా  ప్రతి రోజూ రెండు పూటలా 5 లేక 6 కరివేపాకు ఆకులను తింటే చక్కెర వ్యాధి అదుపులోకి వస్తుంది. రెండు చెంచాల కరివేపాకు పొడిని ఒక గ్లాస్ నీటిలో మరిగించి చల్లారాక తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అంతేకాదు తులసి ఆకులను నీటిలో వేసి 15 నిమిషాల తరువాత తాగినా గుణం కనిపిస్తుంది.  

వంద గ్రాముల మెంతుల్ని 250 ఎంఎల్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరునాడు వడకట్టి తాగాలి. ఇలా రెండు నెలల పాటు చేస్తే ఫలితం ఉంటుంది. వేప ఆకులను కొన్నింటిని తీసుకుని వాటిని ముద్దగా నూరి దాని నుంచి జ్యూస్‌ను తీయాలి. ఈ జ్యూస్‌ను ప్రతి రోజు ఉదయం పరగడుపునే తాగాలి. దీంతో రక్తంలో అధికంగా ఉన్న గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. వీటి  అన్నింటి కంటే  డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ప్రతి రోజు కనీసం 1 గంట పాటు వ్యాయామం  చేసినా వాకింగ్ చేసినా చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఇలా ఈ చిన్నచిన్న చిట్కాలు అనుసరిస్తే డయాబెటిస్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుండి ఉపసమనం పొందవచ్చు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: