ఇది శ్రీ మధ్భాగవతము వివరించిన అంశము ఇలా చెపుతుంది.

అర్జునుడు (పాండవులలో అర్జునుడు కాదు సుమా!) కార్తవీర్యుని కుమారుడు. అందుకే ఆయనను కార్తవీర్యార్జునుడు అంటారు. ఈ విశ్వాంతరాళములో సప్త మహసముద్రాలమధ్య ఉన్న భూఖండాలన్నిటికి ఆయన సామ్రాట్టు.  నర్మదా నదీ తీరములోని మాహిష్మతీ (బాహుబలి సినిమా కోసం ఈ పేరును రాజమౌళి వాడుకున్నాడు) నగరాన్ని రాజధాని గా చేసుకొని కార్తవీర్యార్జునుడు ఈ సమస్త విశ్వాన్ని ఏకచత్రాదిపత్యంగా పరిపాలించిన మహరాజు.  తన గురువైన దత్తాత్రేయుని అనుగ్రహముతో శ్రీ మహవిష్ణువు సుదర్శనచక్రమే మరో అవతారం ధరించి  కార్తవీర్యార్జునుడయ్యాడని అంటారు. అష్ట సిద్దులు అంటే ఎనిమిది దివ్య శక్తులు ఆయన వశమై ఒక యోగి పుంగవుడయ్యాడు. ప్రపంచములో ఏ రాజు తెలివితేటల్లో, వీరత్వములో, ధైర్య సాహసాల్లో, దాతృత్వములో ఆయనకు సాటిరారు.


ఎదురులేక,  వన్నెతరగని ఆయన దైహిక, మనో, ఇంద్రియ శక్తులతో 85000 సంవత్సరాలు ఈ విశ్వాన్ని సంతోష సం-రంభాలతో పరిపాలించాడంటారు. ఆయన కున్న త్రికాల జ్ఞానం అపారం దానితో ఆయన ఎవరైనా ఏదైనా (ఎనీథింగ్) పోగొట్టుకొంటే దానిని ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నా తిరిగి తెచ్చివ్వగలడని పురాణగ్రందాలు చెప్పుతున్నాయి.  కాని కావలసింది సంపూర్ణమైన భక్తి, విశ్వాసం  తో ఆయన ద్వాదశ నామ స్తోత్ర పారాయణం చేయటమే. వెయ్యి బాహువులున్న ఆయనకు వెయ్యిమంది కుమారులున్నారు, వారిలో ఐదుగురిని తప్ప మిగతావారిని పరశురాముడు  క్షత్రియ నిర్మూలనా దీక్ష  లో సం-హరించాడు. వీరి తరవాతి తరములో జన్మించిన వాడే యదుమహారాజు. ఆయన వారసులే యాదవులు. శ్రీకృష్ణుడు యాదవుడే.

 

వాల్మీకి రామాయణములోని ఉత్తరాఖాండలో - అగస్త్యుడు శ్రీ రామునికి ఆదిత్య హృదయం భోధించినప్పుడే రావణ చరిత్రను వివరించాడు. రావణుడు అనేక సంవత్సరాలపాటు ఏకాగ్రతతో తపస్సు చేసుకొని బ్రహ్మను మెప్పించి అనేక వరాలతో పూర్ణ ఫలం పొంది ప్రపంచమే కాదు ఈ విశ్వాంతరాళాన్ని జయించి విజయగర్వంతో తనను ఎదిరించి గెలిచేవాళ్ళే లేరని విర్రవీగేవాడు. అలాంటి సమయము లోనే కార్తవీర్యునితో అహంభావంతో యుద్దం చేశాడు.  ఆ రావణ-అర్జున యుద్దంలో అర్జునుడు తన ముష్టి ఘాతాలతో రావణుని గుండె పై నృత్యమే చేసి  రావణుణ్ణి యుద్దఖైదీ చేసి చెరలో వేశాడు. ఆ దయ నీయ స్థితిలో రావణ పితామహుడు  యతీంద్రియుడైన పులస్త్య మహర్షి  కార్తవీర్యుని శరణు వేడి రావణుణ్ణి చే విడిపించాడు. ఆ తరవాత కార్తవీర్యుని తో స్నేహ పూర్వక సంధి చేసుకుని రావణుడు తన పాలన గావించాడు.


అలాంటి కార్తవీర్యార్జునుడు తనను తన దశనామ స్తోత్రముతో భక్తి విశ్వాసాలతో పూజించిన వారికి ప్రజా అకర్షక శక్తిని, అపారమైన జ్ఞాపక శక్తిని, సిరిసంపదలతో తులతూగే అధృష్టాన్ని, ఒక వేళ ఏదైనా కారణముతో సంపదగాని, కీర్తి ప్రతిష్టలు గాని, ఆయురారోగ్యములు గాని కోల్పోయినట్లయితే తిరిగి పొందగలిగే వరాన్ని ఇస్తాడని ప్రతీతి......ఇంకేం భక్తి శ్రద్దలతో ఈ క్రింద పొందుపరచిన కార్తవీర్య ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠించండి....కోల్పోయిన ప్రేయసి ప్రేమను కూడా తిరిగి పొందవచ్చేమో ప్రయత్నించి చూడండి.  దొంగలు దొచుకున్న సంపదే దైనా తిరిగి దొరకొచ్చు- ఇలా ట్రై చెయ్యండి 


ఓం కార్తవీర్యార్జునో నామః     రాజా బాహు సహస్రవాన్

తస్య స్మరణ మాత్రేనః గతం నష్టంచ లభ్యతేః

 కార్త వీర్యాః ఖలా ద్వెషిః  క్రుథః వీర్యొస్తుథొః బలిః

సహస్ర భాహు శత్రుగ్నొ     రక్థవస్త్రా ధనుః ధరః

 రక్త గందొ  రక్త మాల్యొ  రాజా  స్మరణ  అభీష్టదః

ద్వాదశాతాని నామాని కార్త వీర్యాశ్య యః పఠెత్

సంపద స్తత్ర జయంతె జన స్తత్ర వసంగతః

ఆనయతన్సు దురస్తం క్షేమ లభ యుతం ప్రియం

 సహస్ర  బాహుం మహిథం ససరం సచపం,

రక్తాంబరం వి-విధ రక్థ కిరీత భూషం,

చొరాధి దుష్ట భయ నాసం ఇష్త దాంతం,

ధ్యాయేన్ మహా బలా విజృంభిత కార్త వీర్యం

 యస్య స్మరణ మాత్రేన సర్వ దుఖః  క్షయో భవేత్

యన్నా నామాని మహా వీరశ్చ అర్జున క్రుథః వీర్యవాన్

 హేహయాధి పతె స్తోత్రం సాహస్రవృతి కరితం

వంచితార్థ ప్రధాన్ ఋణం స్వరజ్యం సుకృతం యది

మరింత సమాచారం తెలుసుకోండి: